‘రాధే శ్యామ్’ స్పీడ్ పెంచాడు.. మార్చి 2న మరో ట్రైలర్

ABN , First Publish Date - 2022-03-01T04:55:10+05:30 IST

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. 1970 నాటి అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌లో భారీ స్థాయిలో తెరకెక్కిందీ చిత్రం. ఈ పాన్ ఇండియా చిత్రం

‘రాధే శ్యామ్’ స్పీడ్ పెంచాడు.. మార్చి 2న మరో ట్రైలర్

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. 1970 నాటి అందమైన ప్రేమకథ ఇది. ఇటలీ, హైదరాబాద్‌లోని అద్భుతమైన లొకేషన్స్‌లో భారీ స్థాయిలో తెరకెక్కిందీ చిత్రం. ఈ పాన్ ఇండియా చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది. దీంతో చిత్ర ప్రమోషన్స్ భారీగా చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన కార్యక్రమాల్లో వేగం కూడా పెంచారు. ఈ క్రమంలోనే మార్చి 2 నుండి రెబల్ స్టార్ ప్రభాస్ తన చిత్ర యూనిట్‌తో కలిసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాలన్నీ ఆయన తిరగనున్నారు. దీని కోసం పూర్తిగా బిజీ షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు ప్రభాస్. 


ఇక అదే రోజు అంటే మార్చి 2వ తేదీన చిత్ర రిలీజ్ ట్రైలర్‌ను మథ్యాహ్నం 3గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేస్తూ.. ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్ పాటలు, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్ ట్రైలర్‌తో సినిమాపై మరింతగా అంచనాలను పెంచనున్నారు. ఈ సినిమాకు తెలుగులో పాన్ ఇండియన్ దర్శకుడు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అలాగే కన్నడలో శివరాజ్ కుమార్.. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్.. తమిళంలో సత్యరాజ్ రాధే శ్యామ్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించనున్నారు. హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సూపర్ స్టార్స్ అందరి వాయిస్.. ఆయా భాషల్లో సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సమర్పణలో గోపీ కృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ, ప్రమోద్‌, ప్రసీధలు నిర్మాతలు.

Updated Date - 2022-03-01T04:55:10+05:30 IST