మహిళలకు ప్రత్యేకంగా ‘రాధే శ్యామ్‌’ షో.. సినిమాపై ఫ్యాన్స్ స్పందనిదే!

ABN , First Publish Date - 2022-03-12T03:13:12+05:30 IST

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. సినిమా విడుదలైన అన్నిచోట్లా ప్రభాస్ అభిమానులు ఈ చిత్రానికి నీరాజనాలు

మహిళలకు ప్రత్యేకంగా ‘రాధే శ్యామ్‌’ షో.. సినిమాపై ఫ్యాన్స్ స్పందనిదే!

గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్‌’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. ఈ చిత్రాన్ని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఈదరపల్లిలో ఉన్న వీపీసీ థియేటర్‌లో ఉదయం 9గంటలకు మహిళలు, యువతులకు ప్రత్యేక షోను ప్రదర్శించారు. తొలుత ప్రభాస్‌ అభిమానులైన మహిళలు థియేటర్‌ ఆవరణలో భారీ కేక్‌ను కట్‌చేసి సంబరాలు జరిపారు.


రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. సినిమా విడుదలైన అన్నిచోట్లా ప్రభాస్ అభిమానులు ఈ చిత్రానికి నీరాజనాలు పడుతున్నారు. సినిమా చూసిన అనంతరం ఈ సినిమాపై ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి ప్రేమ కథ చూసి చాలా రోజులైందని.. ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన ప్యూర్ లవ్ స్టోరీ ఇదని వారు తెలుపుతున్నారు. అలాగే విజువల్ ఫీస్ట్‌గా ఈ చిత్రం ఉందని.. ప్రభాస్ లుక్స్, స్టైలింగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణ అంటూ ఫ్యాన్స్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఇంకా ప్రభాస్, పూజా హెగ్డే కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని, ఆర్ట్ వర్క్ అందరినీ ఫిదా చేస్తుందని.. పాటలు, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇలా ప్రతి ఒక్కదాని గురించి ఫ్యాన్సే వివరణ ఇస్తుండటం విశేషం.

Updated Date - 2022-03-12T03:13:12+05:30 IST