Raashi khanna: కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా!

ABN , First Publish Date - 2022-07-04T00:14:36+05:30 IST

‘‘జీవితంలో జయాన్ని అయినా, అపజయాన్ని అయినా ఒకేలా తీసుకోవాలి. ఆఽధ్యాత్మికత అంటే అదే! నేను కర్మ సిద్థాంతాన్ని నమ్ముతాను. నేను అనుభవించే మంచి, చెడులన్నీ నా కర్మలను బట్టే అని నమ్ముతాను. అందుకే సక్సెస్‌ను తలకు ఎక్కించుకోను. ఫెయిల్యూర్స్‌కి బాధపడను’’ అని అంటున్నారు రాశీఖన్నా. తాజాగా ఆమె హీరోయిన్‌గా నటించగా విడుదలైన ‘పక్కా కమర్షియల్‌’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపారు.

Raashi khanna: కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా!

‘‘జీవితంలో జయాన్ని అయినా, అపజయాన్ని అయినా ఒకేలా తీసుకోవాలి. ఆధ్యాత్మికత అంటే అదే! నేను కర్మ సిద్థాంతాన్ని నమ్ముతాను. నేను అనుభవించే మంచి, చెడులన్నీ నా కర్మలను బట్టే అని నమ్ముతాను. అందుకే సక్సెస్‌ను తలకు ఎక్కించుకోను. ఫెయిల్యూర్స్‌కి బాధపడను’’ అని అంటున్నారు రాశీఖన్నా (Raashi khanna). తాజాగా ఆమె హీరోయిన్‌గా నటించగా విడుదలైన ‘పక్కా కమర్షియల్‌’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘‘నా దృష్టిలో ఆధ్యాత్మికత అంటే జీవితంలో దేనినైనా ఒకేలా తీసుకోవాలి. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నాకు వచ్చేది ఏదైనా కర్మను అనుసరించే. అందుకే మంచి ఎదురైనా, చెడు జరిగిన బాధపడను. చాలా బ్యాలెన్స్‌గా ఉంటా. బ్యాలెన్స్‌ చేసుకోవడంలో జీవితం సక్రమంగా ఉంటుందని నా భావన. బ్రహ్మకుమారి బీకే శివాని ప్రబోధాలను అనుసరిస్తాను. వారి ఆలోచనా విధానం బాగా నచ్చింది. మా కుటుంబానికి కూడా ఒక గురువు ఉన్నారు. ఆయన్ను ఎక్కువగా ఫాలో అవుతాం’’ అని వ్యక్తిగత విషయాలు తెలిపారు. (Raashi khanna interview)



అభద్రతాభావం కాదు...

హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్‌ పాత్రలే చేయడానికి కారణం అభద్రతాభావం కాదని నా నమ్మకం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ వెళ్లడమే ముఖ్యం కదా. ఆర్టిస్ట్‌ దగ్గరకు వచ్చిన కథల్లో మంచిది ఎంచుకోవాలి.  ప్రతి నటికీ మంచి పాత్రలు రావాలని లేదు. కమర్షియల్‌... కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు బ్యాలెన్స్‌ చేయాలని ఏ నటి అయినా అనుకుంటుంది. కానీ అది మన చేతుల్లో ఉండదు. ఒకవేళ మనం టాలెంటెడ్‌ అని డైరెక్టర్‌ భావిస్తే బరువైన పాత్రలు ఇస్తారు. కాబట్టి ప్రతి సినిమాలో మంచి నటిగా నిరూపించుకోవాలి. నేనైతే రెండు రకాల సినిమాలూ చేశాను. పైగా ఇప్పుడు పరిస్థితి మారింది. కథానాయిక తన భుజాలపై నడిపించే కథలు, ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. ఓటీటీ వల్ల మంచి మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఓటీటీ కోసం ‘ఫర్జీ’ (Farji)చేస్తున్నాను. డబ్బింగ్‌ జరుగుతోంది. దాని విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఓటీటీలో ఎంత వరకు విజయవంతం అయ్యామనేది తెలుస్తుంది కదా! (Raashi khanna)


Updated Date - 2022-07-04T00:14:36+05:30 IST