బొద్దుగా ఉన్నందుకు ‘దాంతో’ పోల్చేవారట! గుర్తుచేసుకుని బాధపడ్డ అందాల రాశీ!

ABN , First Publish Date - 2022-03-23T03:50:28+05:30 IST

గ్లామర్ ప్రపంచంలోని అమ్మాయిలకు ఎదురయ్యే రెండో అతి తీవ్రమైన సమస్య ‘క్యాస్టింగ్ కౌచ్’! మరి మొదటిది ఏంటి అంటారా? ‘బాడీ షేమింగ్’! క్యాస్టింగ్ కౌచ్ ఎదురు కాని అదృష్టవంతులైన అందగత్తెలకి కూడా అప్పుడో ఇప్పుడో లుక్స్ విషయంలో కామెంట్స్ తప్పవు...

బొద్దుగా ఉన్నందుకు ‘దాంతో’ పోల్చేవారట! గుర్తుచేసుకుని బాధపడ్డ అందాల రాశీ!

గ్లామర్ ప్రపంచంలోని అమ్మాయిలకు ఎదురయ్యే రెండో అతి తీవ్రమైన సమస్య ‘క్యాస్టింగ్ కౌచ్’! మరి మొదటిది ఏంటి అంటారా? ‘బాడీ షేమింగ్’! క్యాస్టింగ్ కౌచ్ ఎదురు కాని అదృష్టవంతులైన అందగత్తెలకి కూడా అప్పుడో ఇప్పుడో లుక్స్ విషయంలో కామెంట్స్ తప్పవు. జనం... సన్నగుంటే చిక్కిపోయిందంటారు. కాస్త లావైతే ఒళ్లు చేసిందంటారు. ఎంతో జాగ్రత్తగా అజంతా శిల్పం లాంటి షేపుని కాపాడుకుంటూ కొనసాగాల్సిందే! మరి ఇందుకు మన అందాల రాశి... రాశీ ఖన్నా మాత్రం అతీతమా చెప్పండి? 


‘రుద్రా’ వెబ్ సిరీస్‌తో చాలా కాలం తరువాత హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాశీ ఖన్నా. జాన్ అబ్రహాం ‘మద్రాస్ కేఫ్‌’తో కెరీర్ ప్రారంభించిన నార్త్ బ్యూటీ తరువాత మాత్రం సౌత్‌లో సెటిలైంది. తెలుగు, తమిళ కుర్రాళ్ల మనసులు దోచింది. అయితే, దక్షిణాదిలో రాశీ గ్లామర్ జర్నీ అంత ఈజీగా ఏం సాగలేదట. మొదట్లో ఈ ముంబై బొద్దుగుమ్మని ఓవర్‌వెయిట్ వయ్యారిగానే చూసేవారట. కొందరైతే ‘గ్యాస్ ట్యాంకర్’ అంటూ వెటకారంగా మాట్లాడేవారట! అప్పట్లో పీసీఓడీ లాంటి సమస్యలతో రాశీ కాస్త బొద్దుగానే ఉండేది కూడా. అయినా కానీ, తనని అలా ‘బాడీ షేమింగ్’ చేయటం ఆమెకు బాధ కలిగించేదట. అటు పరిశ్రమలో, ఇటు సొషల్ మీడియాలో రెండు చోట్లా రాశీని ‘గ్యాస్ ట్యాంకర్’ విమర్శలు ఇబ్బంది పెట్టాయి...


తన బరువు గురించి వీళ్లంతా ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారని కొన్నాళ్లు కలవర పడ్డ రాశీ క్రమంగా లుక్స్ ఇంప్రూవ్ చేసుకుంది. చక్కటి ఫిజిక్ అండ్ ఫిట్‌నెస్ సాధించింది. అయితే, అదంతా ఎవర్నో ఇంప్రెస్ చేయటానికి కాదంటోంది మిస్ ఖన్నా. తాను ఎంచుకున్న వృత్తిలో అందంగా, ఆరోగ్యంగా ఉండటం తప్పనిసరి కాబట్టి ‘జిల్’ బ్యూటీ జిమ్‌కి వెళ్లి జిగేల్‌మనేలా తయారైందట!


తెలుగు, తమిళ చిత్రాలతో సౌత్‌లో బిజీగానే ఉన్న చబ్బీ బ్యూటీ... ‘రుద్రా’ వెబ్ సిరీస్ తరువాత సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘యోధ’ అనే హిందీ సినిమా చేస్తోంది. తొమ్మిదేళ్ల తరువాత మరోసారి బాలీవుడ్ బిగ్ స్క్రీన్‌పైకి రాబోతోన్న రాశీ ఖన్నా ఎలాంటి రిజల్ట్ ఖాతాలో వేసుకుంటుందో... చూడాలి మరి!  

Updated Date - 2022-03-23T03:50:28+05:30 IST