Raashi Khanna: నాకు నచ్చింది.. జనాలకు నచ్చలేదు!

Twitter IconWatsapp IconFacebook Icon
Raashi Khanna: నాకు నచ్చింది.. జనాలకు నచ్చలేదు!

‘పక్కా కమర్షియల్‌’ (Pakka commercial)చిత్రంలో లాయర్‌ ఝాన్సీగా, సీరియల్‌ ఆర్టిస్ట్‌గా అలరించారు రాశీఖన్నా(Raasi khanna). ప్రస్తుతం ఈ చిత్రం విజయోత్సాహంలో ఉన్నారామె! ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘చదువుకుంటున్న సమయంలో ఐ.ఎ.ఎస్‌ అయ్యి ప్రజలకు సేవ చేయాలని కలలు కన్నా. కానీ దైవం వేరే మార్గం చూపించారు. దాంతో ఏ సంబంధం, బ్యాగ్రౌండ్‌ లేని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చా. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ ముందుకెళ్తున్నా. నేను పోషించిన ప్రతి క్యారెక్టర్‌ను ఎంజాయ్‌ చేస్తా. ‘ఊహలు గుసగుసలాడే’లోని ప్రభావతి, ‘తొలిప్రేమ’లో  వర్ష,  ‘సుప్రీమ్‌’ బెల్లం శ్రీదేవి, ‘ప్రతిరోజు పండగే’లో ఏంజెల్‌ ఆర్నా పాత్రలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో యామిని పాత్రకు వ్యక్తిగతంగా బాగా కనెక్ట్‌ అయ్యా. నాకెంతో నచ్చిన ఆ పాత్ర జనాలకు నచ్చలేదు. అందరికీ ఒకటే నచ్చాలని లేదు. అభిమానులు మెచ్చే పాత్రలు చేయాలనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చారు రాశీఖన్నా. ప్రస్తుతం ఆమె నటించిన ‘థ్యాంక్యూ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా రాశీ నటిస్తున్నారు. 



AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.