చిరంజీవికి తల్లిగా మాత్రం చేయను: రాధికా శరత్ కుమార్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (ప్రోమో)

ABN , First Publish Date - 2022-04-01T00:54:18+05:30 IST

2017లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత మళ్లీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంతో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. హీరోయిన్‌గా ఎన్నో అవార్డులను, రివార్డులను అందుకున్న రాధిక..

చిరంజీవికి తల్లిగా మాత్రం చేయను: రాధికా శరత్ కుమార్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (ప్రోమో)

2017లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత మళ్లీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంతో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. హీరోయిన్‌గా ఎన్నో అవార్డులను, రివార్డులను అందుకున్న రాధిక.. ప్రస్తుతం కోలీవుడ్‌లో నటిగా, నిర్మాతగా.. సినిమాలతోనూ, సీరియళ్లతోనూ.. ఇంకా బిజినెస్ వ్యవహారాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలుగులోనూ తన వరకు వచ్చిన అవకాశాలలో మంచి వాటిని సెలక్ట్ చేసుకుని నటిస్తున్న రాధికా.. తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని.. తమ మనసులోని ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో..


-మళ్లీ చిరంజీవి సరసన చేసే అవకాశం వస్తే.. ఎటువంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?

-సెట్‌లో అస్సలు తగ్గేదే లే అన్నట్లుగా ఉంటారంట కదా? నిజమేనా?

-చిరంజీవితో టామ్ అండ్ జెర్రీ ఫైట్.. కంటిన్యూ అవుతుందా?

-నటిగా ఎటువంటి విమర్శలను ఎదుర్కొన్నారు? వాటికి ఎలా బదులిచ్చారు?

-శరత్ కుమార్‌‌తో ఎప్పటి నుండో పరిచయం ఉంది కదా..? ముందు అతనిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదు?

-రాజకీయాల గురించి ఎంతో తెలిసి కూడా మీరు వాటిలోకి ఎందుకు ఎంటరయ్యారు?

-ఇండస్ట్రీలో ఫేస్ చేసిన ఇబ్బందులపై సినిమా చేయబోతున్నారట.. నిజమేనా? అందులో అప్పటి అంశాలన్నీ ఉంటాయా?  వంటి ఎన్నో ప్రశ్నలకు ఆమె ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు.

Updated Date - 2022-04-01T00:54:18+05:30 IST