Vikrant Rona: హల్‪చల్ చేస్తున్న జాక్వలైన్ ‘రా రా రాక్కమ్మా..’ సాంగ్

ABN , First Publish Date - 2022-05-26T02:06:32+05:30 IST

శాండిల్‌వుడ్‌ బాద్‌షా కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ‌’ (Vikrant Rona). జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన ఈ చిత్రానికి అనూప్‌

Vikrant Rona: హల్‪చల్ చేస్తున్న జాక్వలైన్ ‘రా రా రాక్కమ్మా..’ సాంగ్

శాండిల్‌వుడ్‌ బాద్‌షా కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ‌’ (Vikrant Rona). జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన ఈ చిత్రానికి అనూప్‌ భండారి దర్శకుడు. ఈ భారీ చిత్రం జూలై 28న విడుద‌లకానుంది. చిత్ర ప్రమోషన్‪లో భాగంగా.. బుధవారం ఈ చిత్రంలోని ‘రా రా రాక్కమ్మా..’ అనే పక్కా మాస్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో గ‌దాంగ్ రాక్కమ్మా (Gadang Rakkamma) పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. జాక్వలైన్‌ న‌ర్తించిన ఈ సాంగ్‌ను విక్రాంత్ రోణ మూవీ ఆల్బమ్‌ నుంచి తొలి సాంగ్‌గా విడుద‌లచేయగా.. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో హల్‪చల్ చేస్తోంది. గ‌దాంగ్ రాక్కమ్మ పాత్రధారిగా బాలీవుడ్ స్టార్ జాక్వలైన్ ఫెర్నాండెజ్ తన డ్యాన్స్‪తో మెస్మరైజ్ చేస్తుంది. మంగ్లీ (Mangli), న‌కాష్ అజీజ్ (Nakash Aziz) పాడిన ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి (Ramjogayya Shastry) రాశారు.  సాంగ్ చూస్తే ఓ పార్టీ సాంగ్ అని తెలుస్తోంది. కిచ్చా సుదీప్‌, జాక్వలైన్ కలిసి చేసిన డాన్స్‌, అలాగే బీట్.. ఈ పాటని చార్ట్ బస్టర్స్‪లో నిలుపుతోంది.


పాట విడుదల సంద‌ర్భంగా జాక్వలైన్ మాట్లాడుతూ ‘‘రాక్కమ్మా ఓ డిఫ‌రెంట్ సాంగ్. పాట చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఎంతో ఎంజాయ్ చేశాను. మంచి ట్యూన్‌కు చ‌క్కటి లిరిక్స్ కుదిరాయి. దాన్ని అద్భుతమైన డాన్స్ సాంగ్‌గా చిత్రీక‌రించారు. పాన్ ఇండియా లెవ‌ల్లో మాస్ ఆడియెన్స్‌కు న‌చ్చే సాంగ్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సాంగ్‌లో హుక్ స్టెప్‌ను ఎవ‌రైనా ఒక‌సారైనా వేయాల‌ని భావిస్తారు..’’ అని తెలిపింది. కాగా, ఈ చిత్రం క‌న్నడ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో  పాన్ ఇండియా మూవీగా గ్రాండ్‌గా విడుద‌లకానుంది.



Updated Date - 2022-05-26T02:06:32+05:30 IST