ప్రధాని మోదీ దిగిరావాల్సిందే: ఆర్. నారాయణమూర్తి

ABN , First Publish Date - 2022-02-13T19:46:27+05:30 IST

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి మద్దతు తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు సంవత్సరకాలం పూర్తి చేసుకోవడంతో

ప్రధాని మోదీ దిగిరావాల్సిందే: ఆర్. నారాయణమూర్తి

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి మద్దతు తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు సంవత్సరకాలం పూర్తి చేసుకోవడంతో.. కార్మికులు ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశారు. జైల్‌ భరోకు పిలుపు నివ్వడమే కాకుండా.. భారీ ర్యాలీలతో పాటు జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. తాజాగా ఈ ఉద్యమానికి పీపుల్ స్టార్ ఆర్‌.నారాయణమూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా.. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం కానివ్వబోమని.. ప్రాణ త్యాగాలతో వచ్చిన కర్మాగారం ఇదని నారాయణమూర్తి అన్నారు. ప్రధాని మోదీ దిగివచ్చి.. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, అలాగే ఏపీ ప్రభుత్వానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీనికోసం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక తెలుగు బిడ్డగా బాధ్యత వహించాలని ఆయన కోరారు.

Updated Date - 2022-02-13T19:46:27+05:30 IST