భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నా: పీపుల్ స్టార్

ABN , First Publish Date - 2021-12-31T00:43:40+05:30 IST

సినిమా పరిశ్రమను బతికించేలా.. మంచి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి నానికి విన్నవించాను. ఏపీ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు మేలు చేసేలా తగిన నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నాను. భారీ బడ్జెట్ చిత్రాలకు..

భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నా: పీపుల్ స్టార్

ఇటీవల న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సక్సెస్ మీట్‌లో ఏపీలో సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి, సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ ప్రభుత్వంతో సానుకూలంగా చర్చలు జరపాలని పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సమస్యని పరిష్కరించి, సినిమా పరిశ్రమ బతికేలా మంచి నిర్ణయం తీసుకోవాలని ఆయన నేడు (గురువారం) ఏపీ మంత్రి పేర్ని నానిని కోరారు.


ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘సినిమా పరిశ్రమను బతికించేలా.. మంచి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి నానికి విన్నవించాను. ఏపీ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు మేలు చేసేలా తగిన నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నాను. భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ ధరలను పెంచడం అనేది నేను వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే అది అధికారిక బ్లాక్ మార్కెట్ అనేది నా అభిప్రాయం. సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సినిమా టికెట్ ధరలు ఉండాలి. సినిమా తీసేవాడు, చూపించేవాడు, చూసేవాడు... ముగ్గురూ బాగుండాలి. నిర్మాతల మండలి, మా అసోసియేషన్, ఫిల్మ్ ఛాంబర్, సినీ పెద్దలతో.. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యేలా చూడాలని కోరాను. అలాగే ఇండస్ట్రీ వ్యక్తులకు కూడా నేను చెప్పేది ఒక్కటే.. ఎవరూ వ్యక్తిగత ఈగోలకు పోవద్దు. మీ ఈగోలను పరిశ్రమకు ముడి పెట్టి.. ఇండస్ట్రీని ఇబ్బందులకు గురిచేయవద్దు. సినిమా పెద్దలు, ప్రభుత్వ పెద్దలు.. పాజిటివ్ ధృక్పధంతో ఉండాలి. సీఏం స్పందించి.. అందరితో చర్చించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను..’’ అని తెలిపారు.

Updated Date - 2021-12-31T00:43:40+05:30 IST