మీ సినిమా హిట్ అయింది.. Laal Singh Chaddha ఫ్లాప్ అయిందేంటి..? అని Madhavan‌ ను మీడియా అడిగితే..

ABN , First Publish Date - 2022-08-18T21:43:50+05:30 IST

ఇండస్ట్రీతో సంబంధం లేకుండా పలు భాషల్లో సినిమాలు చేస్తున్న నటుడు ఆర్. మాధవన్ (R Madhavan). ‘సఖి’ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారారు. ‘రంగ్ దే బసంతి’, ‘త్రీ ఇడియట్స్’ వంటి హిట్

మీ సినిమా హిట్ అయింది.. Laal Singh Chaddha ఫ్లాప్ అయిందేంటి..? అని Madhavan‌ ను మీడియా అడిగితే..

ఇండస్ట్రీతో సంబంధం లేకుండా పలు భాషల్లో సినిమాలు చేస్తున్న నటుడు ఆర్. మాధవన్ (R Madhavan). ‘సఖి’ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారాడు. ‘రంగ్ దే బసంతి’, ‘త్రీ ఇడియట్స్’ వంటి హిట్ చిత్రాలతో అభిమానులను అలరించాడు. చివరగా ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్’ (Rocketry: The Nambi Effect) లో కనిపించాడు. ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయం సాధించింది. తాజాగా మ్యాడీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ పరాజయంపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. 


థియేటర్స్‌లో తాజాగా విడుదలైన ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha), అక్షయ్ కుమార్ ‘రక్షా బంధన్’ (Raksha Bandhan) సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి. ఈ సినిమాల పరాజయాలతో పాటు ‘రాకెట్రీ’ విజయానికి గల కారణాలను మ్యాడీ అభిమానులతో పంచుకున్నాడు. ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను చూడటానికి అలవాటు పడ్డారని అందువల్లే ‘రాకెట్రీ’ విజయం సాధించిందని తెలిపాడు. ‘‘సినిమాలను హిట్ చేయాలనే అందరు పనిచేస్తుంటారు. నిజం చెప్పాలంటే పరాజయం గురించి ఆలోచిస్తూ ఎవరు పని చేయరు. హిట్, ప్లాప్ సినిమాకు పని విధానం ఒకేలా ఉంటుంది. కానీ, నా చిత్రంలో తేడా ఏంటంటే నేను బయోపిక్‌ను నిర్మించాను. కాలంతో సంబంధం లేకుండా అందరు ఆ చిత్రాన్ని వీక్షిస్తారు. కోవిడ్ అనంతరం ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చాయి. వారు మెచ్చుకునేలా సినిమాలు చేయాలంటే కొంతకాలం పడుతుంది. కొత్త స్క్రీన్ ప్లే‌తో సినిమాలు చేస్తేనే థియేటర్స్‌లో నడుస్తాయి’’ అని మాధవన్ పేర్కొన్నాడు.

Updated Date - 2022-08-18T21:43:50+05:30 IST