Pushpa2: సెట్స్‌పైకి వచ్చేస్తుందా..!

ABN , First Publish Date - 2022-06-15T19:35:35+05:30 IST

మొత్తానికి పుష్ప 2 (Pushpa 2) సెట్స్‌పైకి వచ్చేస్తుందని తాజా సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప పార్ట్ 1 (Pushpa Part 1).

Pushpa2: సెట్స్‌పైకి వచ్చేస్తుందా..!

మొత్తానికి పుష్ప 2 (Pushpa 2) సెట్స్‌పైకి వచ్చేస్తుందని తాజా సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప పార్ట్ 1 (Pushpa Part 1). 2021 క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వరల్డ్ వైడ్‌గా కలక్షన్‌ల వర్షం కురిపించింది. అందుకే ఇప్పుడు పుష్ప2 కోసం భారీ కసరత్తు చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఎర్ర చందనం స్మగ్లింగ్ డాన్‌గా ఎదిగిన పుష్పరాజ్ తన ప్రయాణంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడనే విషయాన్ని సంమ్ థింగ్ స్పెషల్‌గా చూపించబోతున్నాడు. 


ఇప్పటికే స్టోరీలో మార్పులపై క్లారిటీ రావడం, బౌన్డ్ స్క్రీప్ట్ కూడా ఫినిష్ అవ్వడంతో జూలైలో ఫస్ట్ షెడ్యూల్‌ను మొదలు పెట్టి వీలైనంత త్వరగా పుష్ప2 సినిమాని ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప2 కథ విషయంలో అన్ని లెక్కల్ని సరిసమానంగా సెట్ చేసిన సుకుమార్ టోటల్ ప్రాజెక్ట్‌ను 6 నెలల్లో పూర్తి చేసి, 2023 సమ్మర్ కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడట. అలాగే, పార్ట్1లో సమంత స్పెషల్ సాంగ్ హైలెట్‌గా నిలిచిన నేపథ్యంలో సీక్వెల్ కోసం ఈసారి బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని (Disha Pathani)ని రంగంలోకి దింపబోతున్నాడట.


అలాగే, బాలీవుడ్ ,కొలీవుడ్ నుంచి మూడు స్పెషల్ క్యారెక్టర్స్ సీక్వెల్‌లో స్పెషల్‌గా కనిపించబోతున్నాయట. ఇప్పటికే, వీటికి సంబంధించిన చర్చలు కూడా ఫినిష్ అయ్యాయని సమాచారం. మొత్తానికి పుష్పతో వండర్స్ క్రియేట్ చేసిన సుకుమార్ సీక్వెల్ మూవీతో ఎలాంటి రికార్డులను బద్దలు కొడతాడో చూడాలి. కాగా, ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మరో 15 రోజుల్లో పుష్ప 2 సెట్స్‌పైకి రాబోతుందట. దీనిపై త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించబోతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. 

Updated Date - 2022-06-15T19:35:35+05:30 IST