Allu Arjun: పుష్పరాజ్‌ ఈజ్‌ బ్యాక్‌!

ABN , First Publish Date - 2022-08-21T23:09:17+05:30 IST

‘పుష్పరాజ్‌ ఈజ్‌ బ్యాక్‌’.. ‘తగ్గేదేలే’ అంటున్నారు అల్లు అర్జున్‌. ఆయన హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే! ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. సినిమాలో పాటలు, పలు సన్నివేశాలు, బన్నీ మాస్‌ లుక్‌, మేనరిజం ప్యాన్‌ ఇండియా ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేశాయి.

Allu Arjun: పుష్పరాజ్‌ ఈజ్‌ బ్యాక్‌!

‘పుష్పరాజ్‌ (Pushpa raj)ఈజ్‌ బ్యాక్‌’.. ‘తగ్గేదేలే’ అంటున్నారు అల్లు అర్జున్‌(Allu arjun). ఆయన హీరోగా సుకుమార్‌(Sukumar) దర్శకత్వం వహించిన ‘పుష్ప’(Pushpa) చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే! ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. సినిమాలో పాటలు, పలు సన్నివేశాలు, బన్నీ మాస్‌ లుక్‌, మేనరిజం ప్యాన్‌ ఇండియా ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేశాయి. ఇప్పుడు అంతకు రెట్టింపు ఉత్సాహం, అంచనాలతో ‘పుష్ప–2’ తెరకెక్కనుంది.  ‘పుష్ప: ద రూల్‌’ సెట్స్‌ మీదకెళ్లడానికి సిద్ధమైంది. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ పోస్టర్‌ విడుదల చేసి ‘సోమవారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుందని తెలిపింది. 


మొదటి భాగం సక్సెస్‌ కావడంతో రెండోపార్ట్‌పై మరింత దృష్టిపెట్టారు దర్శకుడు సుకుమార్‌. ఇప్పటి వరకూ  కథ, కథనాలను మెరుగుదిద్దే పనిలో ఉండడం వ్ల సెట్స్‌ మీదకె వెళ్లడం ఆలస్యమైంది. ఇప్పుడు గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు రిపేర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా చిత్రీకరణలు నిలిచిపోయాయి. ఛాంబర్‌, నిర్మాతల మండలి నుంచి షూటింగ్‌ పర్మిషన్‌ వస్తే ‘పుష్ప 2 షూటింగ్‌కు తగ్గేదేలే అనేలా ముందుకెళ్లడానికి చిత్ర యూనిట్‌ సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్‌ సరసన, రష్మిక (Rashmika)నటించబోతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ (Devisri prasad)సంగీత దర్శకుడు.





Updated Date - 2022-08-21T23:09:17+05:30 IST