Pushpa in Russia: పాజిటివ్‌ టాక్‌ వస్తే...

ABN , First Publish Date - 2022-12-08T18:02:00+05:30 IST

‘పుష్ప’ సినిమా రష్యాలోనూ హల్‌చల్‌ చేస్తోంది. గురువారం ఈ చిత్రాన్ని అక్కడ భారీగా విడుదల చేస్తున్నారు. దీనికోసం మూడు రోజుల ముందే బన్నీ, రష్మిక, సుకుమార్‌ తదితరులు రష్యా చేరుకుని ప్రచారం చేస్తున్నారు.

Pushpa in Russia: పాజిటివ్‌ టాక్‌ వస్తే...

‘పుష్ప’(Pushpa) సినిమా రష్యాలోనూ (Russia)హల్‌చల్‌ చేస్తోంది. గురువారం ఈ చిత్రాన్ని అక్కడ భారీగా విడుదల చేస్తున్నారు. దీనికోసం మూడు రోజుల ముందే బన్నీ(Allu arjun), రష్మిక(RASHMIKA MANDANNA), సుకుమార్‌ తదితరులు రష్యా చేరుకుని ప్రచారం చేస్తున్నారు.  అయితే అక్కడ జరుగుతున్న ప్రమోషన్‌ ఖర్చు రూ. 5 కోట్లు అని చెబుతున్నారు. ఓ తెలుగు చిత్రాన్ని ఆ ప్రాంతంలో ఇంత భారీగా విడుదల చేయడం ఇదే మొదటిసారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రచారం, సినిమా విడుదల అయింది. అయితే ఫలితం కోసం చిత్ర బృందం ఎదురుచూస్తోంది. అయితే ప్రచారానికి రూ.5 కోట్లు బడ్జెట్‌ చాలా ఎక్కువని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకంటే రష్యాలో తెలుగు సినిమాలు ఆడిన సందర్భాలు తక్కువ. ఇప్పుడు ప్రచారం కోసం పెట్టిన డబ్బు తిరిగి వచ్చినా గొప్పే అంటున్నారు. రూ.2-3 కోట్లలో సినిమా ప్రచారాన్ని ప్లాన్‌ చేసుకున్నారు నిర్మాతలు. అయితే టీమ్‌ నుంచి ఎక్కువమంది సభ్యులు ఉండడంతో అనుకున్న బడ్జెజ్‌ను దాటేసిందని చెబుతున్నారు. మరీ సినిమాకు అక్కడ పాజిటివ్‌ టాక్‌ వస్తే... తెలుగు సినిమాకు రష్యాలోనూ మంచి మార్కెట్‌ ఏర్పడినట్లే! ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీమ్‌ జపాన్‌లో సత్తా చాటింది. చక్కని ఫలితం అందుకుంది. మరి ‘పుష్ప’ చిత్రం ఎంత వరకూ రీచ్‌ అవుతుందో చూడాలి. 


Updated Date - 2022-12-08T18:02:00+05:30 IST