Pushpa Raj The Soldier: అప్పటి అర్జున్ కనిపిస్తున్నాడట!

ABN , First Publish Date - 2022-08-08T23:21:18+05:30 IST

ధ్రువ సర్జా (Dhruva Sarja), రచితా రామ్ (Rachita Ram), హరిప్రియ (Haripriya) జంటగా కన్నడ‌లో రూపొందిన ‘పుష్పరాజ్ ది సోల్జర్’ (Pushpa Raj The Soldier) చిత్రాన్ని ఆర్. యస్. ప్రొడక్షన్స్ నిర్మాణ సారధ్యంలో

Pushpa Raj The Soldier: అప్పటి అర్జున్ కనిపిస్తున్నాడట!

ధ్రువ సర్జా (Dhruva Sarja), రచితా రామ్ (Rachita Ram), హరిప్రియ (Haripriya) జంటగా కన్నడ‌లో రూపొందిన ‘పుష్పరాజ్ ది సోల్జర్’ (Pushpa Raj The Soldier) చిత్రాన్ని ఆర్. యస్. ప్రొడక్షన్స్ నిర్మాణ సారధ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్,  వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై బొడ్డు అశోక్ (Boddu Ashok), కె. రవీంద్ర కళ్యాణ్ (K Ravindra Kalyan) సంయుక్తంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 27న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో.. ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత రామ సత్యనారాయణ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్‌ చేతుల మీదుగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 


ట్రైలర్ విడుదల అనంతరం ప్రసన్న కుమార్ (Prasanna Kumar) మాట్లాడుతూ.. ‘‘రియల్ ఎస్టేట్‌లో విజయవంతంగా ముందుకెళుతూ.. సినిమా రంగంలో కూడా సక్సెస్ అవ్వాలని సినిమాలు తీస్తున్న వ్యక్తి  బొడ్డు అశోక్. క్రేజీ  సినిమాలకు అయస్కాంతంలా అతుక్కుపోతుంటాడు. అలా అయస్కాంతంలా దొరికిన ఈ సినిమా మంచి సినిమాలా కనిపిస్తుంది. ఈ టైటిల్ చూస్తుంటే చార్లెస్ శోభరాజ్, అల్లు అర్జున్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కమర్షియల్‌గా చూసుకుంటే ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఇదే హీరో తెలుగులో చేసిన ‘పొగరు’ సినిమా బాగా ఆడింది. హీరో ధ్రువ సర్జాను చూస్తుంటే యాక్షన్ కింగ్ అర్జున్‌ (Arjun)గారు వయసులో ఉన్నప్పుడు ‘మా పల్లెలో గోపాలుడు’ టైమ్‌లో ఎలా ఉండేవాడో ఇప్పుడు ఈ సినిమాలో అలా కనిపిస్తున్నాడు. తెలుగులో సినిమాలు చేసిన హరిప్రియ ఇందులో హీరోయిన్‌గా నటించారు. మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ యాడ్స్ సెంటిమెంట్‌ను వాడుకుని.. ఈ సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు. 


నిర్మాత రామ సత్యనారాయణ (Rama SatyaNarayana) మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా పుష్పరాజ్ అనే టైటిల్‌తోనే 50 శాతం మార్కులు కొట్టేసింది. ట్రైలర్ చూస్తుంటే చాలా ఎక్సట్రార్దినరీగా ఉంది. ఇది డబ్బింగ్ సినిమాలా కాకుండా  స్ట్రెయిట్ సినిమా అనిపించేలా ఉంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. అశోక్ గతంలో అద్భుతమైన మంచి సినిమాలు తీశాడు. రియల్ ఎస్టేట్‌లో విజయం సాధించినట్లే.. సినిమా రంగంలోనూ గొప్ప విజయం సాదించాలి. కన్నడలో ఈ సినిమా మంచి విజయం సాధించి.. రూ. 49 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో కూడా అదే మోతాదులో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. 


చిత్ర నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. ‘క్రేజీ అంకుల్స్’ తరువాత  మేము తీసిన స్ట్రెయిట్ ఫిలిం ‘గోల్డ్ మ్యాన్’ 10 డేస్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మేము విడుదల చేస్తున్న ఈ సినిమా విషయానికి వస్తే ఈ క్రెడిట్ అంతా రవీంద్ర కళ్యాణ్ కే చెందుతుంది.ఎందుకంటే తనే అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. మూవీ మాక్స్ ద్వారా పుష్పరాజ్ సినిమాను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిర్మాత తిరుపతి రెడ్డిగారి సినిమా ‘తీస్ మార్ ఖాన్’ కూడా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. హీరో శ్రీహరి నాకు క్లాస్ మెట్.. తనతో నేను ట్రావెల్ చేశాను. తను ఎక్కడున్నా మమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఆశిస్తున్నాను..’’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూవీ మాక్స్ అధినేత  శ్రీనివాస్, దర్శకుడు సూర్య కిరణ్, ఆదిత్య, తిరుపతి రెడ్డి, పుప్పా అంకంబరావు, రేణుక, రామకృష్ణ  తదితరులు ఈ సినిమా విజయం సాధించాలని కోరారు.

Updated Date - 2022-08-08T23:21:18+05:30 IST