Pushpa Raj రీచ్ ఏ టాలీవుడ్ హీరోకి లేదు.. తగ్గేదే లే!

ABN , First Publish Date - 2022-07-26T23:15:15+05:30 IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), మ్యూజికల్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. పోస్ట్ ప్రొడక్షన్ సరిగ్గా అవ్వలేదు, ప్రొమోషన్స్ సరిగ్గా

Pushpa Raj రీచ్ ఏ టాలీవుడ్ హీరోకి లేదు.. తగ్గేదే లే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), మ్యూజికల్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. పోస్ట్ ప్రొడక్షన్ సరిగ్గా అవ్వలేదు, ప్రొమోషన్స్ సరిగ్గా చేయలేదు, రిలీజ్ అయిన ఫస్ట్ డేకే డివైడ్ టాక్, టికెట్ రేట్స్ కూడా తక్కువగా ఉన్నాయి, బన్నీ సుక్కు ఫ్లాప్ ఫేస్ చేస్తారేమో అని అంతా అనుకున్నారు కానీ.. అందరి అంచనాలని తలకిందులు చేస్తూ, పుష్ప రాజ్ (Pushpa Raj) మేనియా వరల్డ్‌ని షేక్ చేసింది. ప్రతి సెలబ్రిటీ తగ్గేదే లే అన్నాడు.. అల్లు అర్జున్ మ్యానరిజం ఫాలో అయ్యాడు. ఒక్క ప్రొమోషనల్ ఈవెంట్ లేకుండా హిందీలో వంద కోట్లు రాబట్టింది అంటే పుష్ప ఇండియాని ఏ రేంజులో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో బన్నీ అండ్ సుకుమార్ కుంభస్థలాన్నే బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్నారు. 


ఈ సీక్వెల్‌తో మరోసారి పాన్ ఇండియాని షేక్ చేయాలని సిండికేట్ కింగ్ పుష్ప రాజ్ డిసైడ్ అయ్యాడు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు, ఇప్పటివరకూ బెస్ట్ హీరో కేటగిరిలో తెలుగు హీరోకి ఒక్క నేషనల్ అవార్డు కూడా రాలేదు. అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ ఇయర్ ఆ లోటుని భర్తీ చేయబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ నేషనల్ అవార్డు (National Award) బన్నీదే అని చాలా మంది కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆ విషయం అలా ఉంచితే.. స్టైలిష్ స్టార్ తన కొత్త ఫోటోని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జనరల్‌గా ఒక హీరో ఫొటో పోస్ట్ చేస్తే, దానికి ఫ్యాన్స్ ఏవేవో రిప్లయ్‌లు ఇస్తూ ఉంటారు కానీ... అల్లు అర్జున్ ఫొటోకి దాదా సాహెబ్ ఫాల్కే ట్విట్టర్ అకౌంట్ నుంచి రిప్లయ్ వచ్చింది అంటే బన్నీ క్రేజ్ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే ‘పుష్ప 2’ రిలీజ్ అయ్యే టైంకి అల్లు అర్జున్ రేంజ్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటుందేమో.



Updated Date - 2022-07-26T23:15:15+05:30 IST