‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’.. ప్రాక్టీస్‌లోనూ హాట్ హాట్‌గా సమంత! వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-01-06T22:16:01+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ సమంత ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’ అంటూ ఓ ప్రత్యేక గీతంలో మెరిసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే

‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’.. ప్రాక్టీస్‌లోనూ హాట్ హాట్‌గా సమంత! వీడియో వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ సమంత ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’ అంటూ ఓ ప్రత్యేక గీతంలో మెరిసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే ఈ పాట సంచలనాలను క్రియేట్ చేసింది. ఈ పాట అనే కాదు సినిమాలోని అన్ని పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. కాకపోతే సమంత ఈ పాటకి డ్యాన్స్ చేయడంతో.. ఈ ప్రత్యేక గీతం ఇంకాస్త ప్రత్యేకతను సంతరించుకుంది. బన్నీతో కలిసి ఈ పాటకి ఆమె వేసిన స్టెప్స్, హావభావాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. తాజాగా ఈ పాట కోసం ఎలా సాధన చేసిందో తెలిపేలా.. సమంత ఓ వీడియోని పోస్ట్ చేసింది. 


ఈ వీడియోలో స్టెప్స్ మాత్రమే కాదు.. ఆమె కనిపించిన విధానం కూడా నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తుంది. అరకొర దుస్తుల్లో హాట్‌హాట్‌గా సమంత ఈ సాధనలో కనిపించింది. ఈ వీడియోని స్వయంగా సమంతే తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేయడం గమనార్హం. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘పుష్ప కాదు.. సమంత ఫైర్’, ‘అరుపులే..’ అన్నట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-01-06T22:16:01+05:30 IST