‘పుష్ప’: ఊపేస్తున్న ‘ఊ అంటావా.. ఊఊ అంటావా..’ ఫుల్ వీడియో సాంగ్

ABN , First Publish Date - 2022-01-07T23:48:07+05:30 IST

‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా..’ అంటూ వైరల్ అయిన ‘పుష్ప’ మూవీ ప్రత్యేక గీతానికి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం ‘సామి సామి’ వీడియో సాంగ్‌ని విడుదల చేసిన మేకర్స్.. సాయంత్రం

‘పుష్ప’: ఊపేస్తున్న ‘ఊ అంటావా.. ఊఊ అంటావా..’ ఫుల్ వీడియో సాంగ్

‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా..’ అంటూ వైరల్ అయిన ‘పుష్ప’ మూవీ ప్రత్యేక గీతానికి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం ‘సామి సామి’ వీడియో సాంగ్‌ని విడుదల చేసిన మేకర్స్.. సాయంత్రం ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ వీడియో సాంగ్‌ని విడుదల చేసి.. రోజంతా సోషల్ మీడియాలో ‘పుష్ప’ ట్యాగ్ హోరెత్తేలా చేశారు. ఈ చిత్రం నేడు(శుక్రవారం) అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలవుతోన్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా..’ లిరికల్ సాంగ్ రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంటే.. తాజాగా విడుదల చేసిన వీడియో సాంగ్ కూడా కొన్ని నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ సాధించి.. ఈ పాటకున్న పవర్ ఎలాంటిదో మరోసారి తెలియజేసింది.   



Updated Date - 2022-01-07T23:48:07+05:30 IST