నేపాల్లోనూ జెండా ఎగరేస్తున్న ‘పుష్ప’

ABN , First Publish Date - 2022-01-13T17:41:31+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ జైత్రయాత్ర ఇంకా కొనసాగుతునే ఉంది. బాలీవుడ్ లో ఇంకా బ్రహ్మాండమైన కలెక్షన్స్ వస్తుండడంతో హిందీ వెర్షన్ ను ఓటీటీలోకి ఇంకా వదల్లేదు. అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్, రష్మికా గ్లామర్ అపీరెన్స్ ఈ సినిమాని మాస్ జనానికి బాగా దగ్గరగా తీసుకెళ్ళాయి. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పుష్పరాజ్ హవా మామూలుగా లేదు. సినిమా విడుదల రోజున నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది.

నేపాల్లోనూ జెండా ఎగరేస్తున్న ‘పుష్ప’

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ జైత్రయాత్ర ఇంకా కొనసాగుతునే ఉంది. బాలీవుడ్ లో ఇంకా బ్రహ్మాండమైన కలెక్షన్స్ వస్తుండడంతో హిందీ వెర్షన్ ను ఓటీటీలోకి ఇంకా వదల్లేదు. అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్, రష్మికా గ్లామర్ అపీరెన్స్ ఈ సినిమాని మాస్ జనానికి బాగా దగ్గరగా తీసుకెళ్ళాయి. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పుష్పరాజ్ హవా మామూలుగా లేదు. సినిమా విడుదల రోజున నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. రివ్యూస్ కూడా నెగెటివ్ గా వచ్చాయి. అయినప్పటికీ.. అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద తగ్గిందే లేదు.  ఇప్పుడు ఈ సినిమాకి మరో ఎచీవ్ మెంట్ కూడా యాడ్ అయింది. 


నేపాల్లో ‘పుష్ప’ హిందీ వెర్షన్ విడుదలైంది. అక్కడ కూడా ఈ సినిమా హవా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అక్కడ జనం పుష్పను ఏ రేంజ్ లో ఆదిరిస్తున్నారు అనేదానికి సాక్ష్యంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ‘పుష్ప’ నేపాల్లో కూడా తగ్గేదేలేదంటూ.. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫిబ్రవరిలో పుష్ప 2 చిత్రీకరణ ప్రారంభం కానుంది. రెండో భాగం కోసం సుక్కూ అండ్ టీమ్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  



Updated Date - 2022-01-13T17:41:31+05:30 IST