విజయ్ బై లింగ్విల్ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక

ABN , First Publish Date - 2022-03-10T02:19:53+05:30 IST

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఇళయ దళపతి విజయ్

విజయ్ బై లింగ్విల్ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఇళయ దళపతి విజయ్. ప్రస్తుతం నెల్సన్ తెరకెక్కిస్తున్న ‘బీస్ట్’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్‌లో భారీ అంచనాలున్నాయి. అనంతరం విజయ్ టాలీవుడ్‌లో నేరుగా సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి ‘దళపతి-66’ అని వర్కింగ్ టైటిట్ పెట్టారు. ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ మూవీని బై లింగ్విల్‌‌గా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు.  


దళపతి తెలుగులో చేయబోయే చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా ఎంపికయిందని సమాచారం. పూజ హెగ్డే, కియారా అడ్వాణీ హీరోయిన్ పాత్రకు పోటీపడినప్పటికీ చివరికీ రష్మికను ఆ స్థానం వరించిందంట. షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నారు కాబట్టి సినిమా కోసం ఓ రాజభవనం సెట్‌ను వేస్తున్నారు. ప్రస్తుతం ఈ సెట్ నిర్మాణంలో ఉంది. ఒకవేళ షూటింగ్ ప్రారంభం అయ్యే నాటికి సెట్ పనులు పూర్తి కాకపోతే పాటను చిత్రీకరించే ఆలోచనలో చిత్రబృందం ఉంది.

Updated Date - 2022-03-10T02:19:53+05:30 IST