WWE లో ‘పుష్ప’ మ్యానరిజం.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-07-01T19:31:49+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప ది రైజ్’ (Pushpa the rise) సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందే తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డు కలెక్షన్స్ నమోదు చేసి అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసేసింది.

WWE లో ‘పుష్ప’ మ్యానరిజం.. వీడియో వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప ది రైజ్’ (Pushpa the rise) సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందే తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డు కలెక్షన్స్ నమోదు చేసి అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసేసింది. ఎర్రచందన స్మగ్లర్ గా, పక్కా మాస్ గెటప్ తో అదరగొట్టిన బన్నీ.. ఈ సినిమాలో చెప్పిన తగ్గేదేలే డైలాగ్‌ దేశవ్యాప్తంగా పాపులరై పోయింది. గెడ్డం కింద చెయ్యిపెడుతూ.. బన్నీ స్టెప్స్ ను అనుకరిస్తూ..  యూత్ ఊగిపోయారు. అంతేకాదు..  ప్రముఖ క్రికెటర్స్ సైతం తగ్గేదేలే అనే మ్యానరిజంతో పుష్ప పాత్రకి బోలెడంత ప్రచారం కల్పించారు. ఇప్పుడది మరో క్రీడకు కూడా పాకింది. ఈ సారి ఆ డైలాగ్  WWE వేదికపై మారుమోగింది. 


ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజాదరణ కలిగిన షోగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైనింగ్ షో గుర్తింపు పొందింది. చూడ్డానికి అత్యంత ప్రమాదకరమైనదిగా కనిపించే ఈషోను చాలా మంది ఇష్టంగా చూస్తారు. ఇండియన్ రెజ్లర్ అయిన సౌరవ్ గుర్జార్ (Sourav Gurjar) పుష్ప డైలాగ్ . జూకేంగా నై అంటూ.. ప్రత్యర్ధిని చిత్తుచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప క్రేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఈషో చూస్తే అర్ధమవుతుంది. సౌరవ్ గుర్జార్ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఇంకా ఎంతో మంది ఈ వీడియోకు స్పందిస్తూ షేర్ చేస్తున్నారు. బన్నీ, పుష్ప టీమ్ కూడా ఈ వీడియోకు స్పందిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 



Updated Date - 2022-07-01T19:31:49+05:30 IST