అస్సలు తగ్గేదేలే.. ‘పుష్ప’కి 100 కోట్లు

ABN , First Publish Date - 2022-02-01T03:56:08+05:30 IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం కరోనా సమయంలోనూ ఘన విజయాన్ని అందుకుంది. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా

అస్సలు తగ్గేదేలే.. ‘పుష్ప’కి 100 కోట్లు

ఐకాన్ స్టార్ ‘పుష్ప’ మరో రికార్డుని సొంతం చేసుకుంది. హిందీలో ఈ చిత్రం 100 కోట్లు కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం కరోనా సమయంలోనూ ఘన విజయాన్ని అందుకుంది. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ చిత్రం వసూలు చేసి అస్సలు ఎక్కడా తగ్గేదేలే.. అన్నట్లుగా దూసుకుపోతోంది. కలెక్షన్స్‌ మాత్రమే కాదు ఈ చిత్రం విడుదలైన అన్నిచోట్లా ప్రశంసలు అందుకోవడం విశేషం. సైలెంట్‌గా విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 


సోషల్ మీడియాలో ఈ చిత్ర పాటలను, డాన్సులను చేస్తున్న రీల్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా తగ్గేదే లే.. అంటూ పుష్ప ఫీవర్‌లో ఉన్న విషయం తెలియంది కాదు. ఓవైపు కరోనా వైరస్ భయపెడుతున్నా కూడా.. ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించింది ‘పుష్ప’. సౌత్ టూ నార్త్ వరకు.. విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంది. రీసెంట్‌గా ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ చిత్రానికి మరింతగా ఆదరణ పెరిగింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేటర్లలో మంచి స్పందన ‘పుష్ప’కే చూస్తున్నానంటూ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారంటే.. ‘పుష్ప’ ప్రభంజనం ఏమాత్రం తగ్గలేదనేది స్పష్టమవుతోంది. ఉత్తరాది ప్రేక్షకులను మొన్నటి వరకూ యూ ట్యూబ్‌లో ఆకట్టుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు థియేటర్స్‌‌లో కూడా తగ్గేదేలే అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. కేవలం తెలుగు, హిందీలో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా పుష్ప మంచి స్కోర్ చేసింది. కాగా, త్వరలోనే పుష్ప 2 షూటింగ్ మొదలుపెట్టేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Updated Date - 2022-02-01T03:56:08+05:30 IST