‘పుష్ప’ క్రేజు.. అస్సలు తగ్గడం లేదుగా..!

ABN , First Publish Date - 2022-03-10T02:08:25+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ అనే చిత్రం ప్రకటించినప్పుడు అందరిలో మిక్స్‌డ్ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ సినిమా విడుదల తర్వాత సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ అని చెప్పలేం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. మెడ వంకరగా పెట్టి..

‘పుష్ప’ క్రేజు.. అస్సలు తగ్గడం లేదుగా..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ అనే చిత్రం ప్రకటించినప్పుడు అందరిలో మిక్స్‌డ్ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ సినిమా విడుదల తర్వాత సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ అని చెప్పలేం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. మెడ వంకరగా పెట్టి శ్రీవల్లి పాట స్టెప్, లేదంటే ‘రారా సామి’ అనే రష్మిక స్టెప్‌తో ఒకటే రీల్స్. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్స్ #ThaggedheLe, #MainJhukegaNahi అంటూ పుష్పరాజ్ మ్యానరిజంతో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాదు క్రికెట్‌లో కూడా చాలా మంది నేషనల్, ఇంటర్నేషనల్ క్రికెటర్స్ పుష్ప మేనరిజమ్ చేస్తూ ‘పుష్ప’ క్రేజ్ ఎంతవరకు వెళ్లిందో తెలియజెప్పారు. డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సహా చాలామంది ఫేమస్ క్రికెటర్స్ పుష్ప సినిమా డైలాగ్స్ చెప్పి గ్లోబల్ వైడ్ ట్రెండింగ్ చేశారు. రీసెంట్‌గా జరిగిన ఇండియా, శ్రీలంక మ్యాచ్‌లో రవీంద్ర జడేజా సెంచరీ చేసిన తర్వాత, వికెట్ తీసిన తర్వాత తగ్గేదే లే అంటూ తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. అలాగే ఐఎస్ఎల్‌లో భాగంగా ఫుట్ బాల్ ఫీల్డ్ లోనూ గోల్ వేసిన తర్వాత శ్రీవల్లి స్టెప్ వేయడం గమనించవచ్చు. ఇలా పుష్ప సినిమాను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు తమకు ఓన్ చేసుకొని ‘తగ్గేదే లే’ అన్నట్లుగా సెలబ్రేట్ చేసుకొంటున్నారు.


ఒక్క ఆటల్లో అనే కాదు.. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా పుష్ప సినిమా డైలాగులు తమ ప్రచారంలో వాడుకుంటున్నారు. ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ స్పీచ్ ఇస్తున్నారు. ఓ పొలిటికల్ ర్యాలీలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ కూడా పుష్ప డైలాగ్స్ బాగానే వాడుకున్నారు. క్రికెటర్స్, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మాత్రమే కాదు కామన్ పీపుల్ కూడా పుష్ప సినిమాని పూర్తిగా ఓన్ చేసుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమాను ఒక పండగలా సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ఇప్పట్లో ఈ క్రేజు తగ్గేలా అయితే కనిపించడం లేదు. శ్రీవల్లి హుక్ స్టెప్ 3 మిలియన్ రీల్స్‌కు చేరువైంది అంటే ‘పుష్ప’ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు వసూలు చేయడం మాత్రమే కాదు.. అక్కడి ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది ‘పుష్ప’. బాలీవుడ్ ప్రముఖులు వరుసగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. అంతే కాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ హీరో రణవీర్ సింగ్ కూడా తగ్గేదే లే అనేశాడు. ఒక్క రణవీర్ సింగ్ మాత్రమే కాదు.. ఎందరో బాలీవుడ్ హీరోలు ‘పుష్ప’కు కనెక్ట్ అయ్యారు. అలాగే బాలీవుడ్‌లో జరిగే కార్యక్రమాలలో ‘పుష్ప’కి సంబంధించిన ప్రస్తావన లేకుండా ఉండటం లేదంటే అతిశయోక్తి కానే కాదు. ఇలా మొత్తంగా చూస్తే.. ‘పుష్ప’ క్రేజ్ ఇప్పడప్పుడే తగ్గేలా అయితే కనబడటం లేదు. ఈ క్రేజ్‌ని మరింత పెంచేలా ‘పుష్ప 2’తో సుకుమార్ ఎటువంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూద్దాం.

Updated Date - 2022-03-10T02:08:25+05:30 IST