Akshara: ‘పుష్ప’తో గుర్తింపు.. ‘పుష్ప 2’లోనూ కొనసాగింపు!

ABN , First Publish Date - 2022-09-10T18:29:32+05:30 IST

అక్షర (Akshara).. తెలుగమ్మాయ్. ‘పుష్ప’ (Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun)కి వదినగా నటించిన అక్షర.. ఆ తర్వాత బిజీ నటిగా మారిపోయింది. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన..

Akshara: ‘పుష్ప’తో గుర్తింపు.. ‘పుష్ప 2’లోనూ కొనసాగింపు!

అక్షర (Akshara).. తెలుగమ్మాయ్. ‘పుష్ప’ (Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun)కి వదినగా నటించిన అక్షర.. ఆ తర్వాత బిజీ నటిగా మారిపోయింది. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్షరను మంచి అవకాశాలే వరించాయి. కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ (Entha Manchivaadavuraa) చిత్రంలో పెళ్లి కూతురు పాత్రతో ప్రయాణం మొదలెట్టిన అక్షర.. ఆ తర్వాత రామ్ ‘రెడ్’ (Red) సినిమాలో ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్తె పాత్రలో నటించింది. ఆ తర్వాత ‘పుష్ప’ అవకాశం. ‘పుష్ప’లో వచ్చిన గుర్తింపుతో ఆమె పాత్రను ‘పుష్ప 2’లోనూ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ పార్ట్‌లో ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రవితేజ, సుధీర్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘రావణాసుర’ (Ravanasura)లోనూ ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లుగా తాజాగా ఆమె చెప్పుకొచ్చింది. 


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టాలెంట్ ఉంటే తెలుగు పరిశ్రమలో అవకాశాలెప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న మరిన్ని మంచి రోల్స్ చేయాలనేది నా లక్ష్యం. నా టాలెంట్ చూసి.. ఆడిషన్స్‌కు పిలిచి అవకాశాలు ఇస్తున్న దర్శక నిర్మాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘పుష్ప’ సినిమా తర్వాత నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘పుష్ప 2’లోనూ నా పాత్ర కొనసాగుతుంది. ‘పుష్ప 2’ విడుదల తర్వాత నాకు ఇంకా మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను. మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.. అని చెప్పుకొచ్చింది.



Updated Date - 2022-09-10T18:29:32+05:30 IST