Pushpa 2 : నటీనటుల వేటలో మేకర్స్

ABN , First Publish Date - 2022-06-07T15:40:47+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప : ది రైజ్’ (Pushpa ; The Rise). ఈ చిత్రం జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) కథానాయికగా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ (Fahad Fasil) ప్రధాన విలన్ గా నటించి మెప్పించిన ఈ సినిమా గతేడాది చివర విడుదలై.. దేశం మొత్తం ట్రెండింగ్ లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ కుంభ వృష్టి కురిపించింది.

Pushpa 2 : నటీనటుల వేటలో మేకర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్  ‘పుష్ప : ది రైజ్’ (Pushpa ; The Rise). ఈ చిత్రం జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) కథానాయికగా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ (Fahad Fasil) ప్రధాన విలన్ గా నటించి మెప్పించిన ఈ సినిమా గతేడాది చివర విడుదలై.. దేశం మొత్తం ట్రెండింగ్ లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ కుంభ వృష్టి కురిపించింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ చిత్రం రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగానికి వచ్చిన స్పందనను, ఆ సినిమా విషయంలో తలెత్తిన కొన్ని విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని ‘పుష్ప ది రూల్’ చిత్రం స్ర్కిప్ట్ పై సుకుమార్ అండ్ టీమ్ కసరత్తులు మొదలు పెట్టింది. 


పుష్పరాజ్ (Pushparaj) పాత్రను మరింత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దుతున్నారు. అలాగే.. ఇందులో మరికొందరు నటీనటుల్ని ఎంపిక చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆడిషన్స్ ను మొదలు పెట్టబోతున్నారు నిర్మాతలు. ‘పుష్ప ది రూల్’ (Pushpa : The Rule) చిత్రం షూటింగ్ మొదలు పెట్టడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైంది. లొకేషన్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. అయితే చిత్రీకరణ మొదలు పెట్టడానికి ముందు కేస్టింగ్ కాల్ ను మొదలు పెట్టారు మేకర్స్. ఆడిషన్స్ ఈ నెల 10వ తేదీ నుంచి హైదరాబాద్ జూబ్లీహిల్స్ జరగబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. పుష్ప లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించడం ఎవరికైనా గొప్ప అచీవ్ మెంట్. అందుకే ఈ ఆడిషన్స్ కు పెద్ద ఎత్తున జనం తరలి వస్తారని చెప్పుకోవచ్చు. 


మొదటి భాగంలోని కొన్ని ప్రధాన పాత్రల్ని రెండో భాగంలోనూ కంటిన్యూ చేస్తూ.. మరికొందరు అదనపు నటీనటుల్ని ఎంపిక చేయబోతున్నారు. సునీల్ (Sunil), అనసూయ (Anasuya), పుష్ప తల్లి, జగదీష్ (Jagadish), ధనుంజయ్ (Dhanunjay) లాంటి పాత్రలు రెండో భాగంలో  ప్రేక్షకుల్ని మరింతగా అలరించడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమా ఆడిషన్స్ లో ఎంపికయ్యే అదృష్టవంతులు ఎవరవుతారో చూడాలి.  

Updated Date - 2022-06-07T15:40:47+05:30 IST