Puri Jagannath: డిస్ట్రిబ్యూటర్స్‌కు అండ..!

Twitter IconWatsapp IconFacebook Icon
Puri Jagannath: డిస్ట్రిబ్యూటర్స్‌కు అండ..!

టాలీవుడ్‌లోని స్టార్ డైరెక్టర్స్‌లో పూరీ జగన్నాథ్ (Puri Jagannath) ఒకరు. హీరో క్యారెక్టరైజేషన్‌ను కొత్తగా చూపించడంలో పూరీకి సాటి రారెవ్వరు.  తాజాగా ‘లైగర్’ (Liger) కు దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించాడు. పూరీ కనెక్ట్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా రూపొందించింది. విడుదలకు ముందు మూవీపై భారీ బజ్ ఉంది. అందువల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. థియేటిక్రల్ రైట్స్ రూ.90కోట్లకు అమ్ముడయ్యాయి. సినిమా ఆ స్థాయి వసూళ్లను రాబడుతుందని డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆశించారు. అందువల్ల భారీ ధరకు రైట్స్‌ను కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయలేదు. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లైగర్’ ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్‌ వచ్చింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద సినిమా దారుణంగా పరాజయం పాలయింది. పూర్తి రన్‌లో రూ.50కోట్ల వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. మూవీ ప్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. అందువల్ల పూరీ వారికి అండగా ఉంటానని మాటిచ్చాడు. తాజాగా ఆ మాటను నిలబెట్టుకున్నాడని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. 


‘లైగర్’ తో భారీ‌గా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్‌కు పూరీ జగన్నాథ్ అండగా నిలుస్తున్నాడట. మూడు రోజుల నుంచి వారి బ్యాంక్ అకౌంట్స్‌లో డబ్బులను జమ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. పరాజయంతో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన డిస్ట్రిబ్యూటర్స్ ఈ డబ్బుతో కొంత ఉపశమనం పొందినట్టు సమాచారం. లైగర్ పరాజయం కావడంతో దాని ప్రభావం పూరీ కెరీర్‌పై కూడా పడింది. విజయ్‌తో అంతకు ముందే పూరీ ‘జనగణమన’ (Jana Gana Mana) ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. లైగర్ ప్లాఫ్ కావడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ‘జేజీఎం’ ప్రాజెక్టు నుంచి నిర్మాత తప్పుకొన్నట్టు వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ, ఈ వదంతులన్నింటిని ‘లైగర్’ సహ నిర్మాత ఛార్మీ కౌర్ ఖండించింది. రిప్ రూమర్స్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే, పూరీ తర్వాతి ప్రాజెక్టు ఏంటి.. ‘జేజీఎం’  పట్టాలెక్కబోతుందా లేదా అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.