Puri Jagannath : మరో దారి లేదు మరి..

ABN , First Publish Date - 2022-09-06T15:07:32+05:30 IST

ఒకప్పుడు టాలీవుడ్‌లో దర్శకుడిగా పూరీ జగన్నాథ్ (Puri Jagannath) లెవెలే వేరు. యంగ్ టాప్ స్టార్స్‌తో తక్కువ బడ్జెట్‌లో అతి తక్కువ రోజుల్లో సినిమాలు తీసి.. బ్లాక్ బస్టర్స్ సాధించిన ఘనత ఆయనది. అప్పట్లో హీరోలంతా పూరీ దర్శకత్వంలో ఒక్క సినిమా చేసినా చాలు అనుకొనేవారు.

Puri Jagannath : మరో దారి లేదు మరి..

ఒకప్పుడు టాలీవుడ్‌లో దర్శకుడిగా పూరీ జగన్నాథ్ (Puri Jagannath) లెవెలే వేరు. యంగ్ టాప్ స్టార్స్‌తో తక్కువ బడ్జెట్‌లో అతి తక్కువ రోజుల్లో సినిమాలు తీసి..  బ్లాక్ బస్టర్స్ సాధించిన ఘనత ఆయనది. అప్పట్లో హీరోలంతా పూరీ దర్శకత్వంలో ఒక్క సినిమా చేసినా చాలు అనుకొనేవారు. అంతగా క్రేజ్ సంపాదించుకున్న ఆయన ‘టెంపర్’ (Temper) వరకూ మంచి సక్సెస్ టెంపోని మెయిన్ టెయిన్ చేశాడు. ఆ తర్వాత నుంచి చాలా ఏళ్ళు సక్సెస్ లేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అలాంటి టైమ్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart shankar) ఆయన కెరీర్ కు కొత్త ఊపిరులూదింది. ఆ దశలో ఆయనకి సక్సెస్ అంత్యంత ముఖ్యం. దీంతో పూరీ కెరీర్ మళ్ళీ గాడిలో పడినట్టే కనిపించింది. విజయ్ దేవరకొండ లాంటి యూత్‌ఫుల్ ఇమేజ్ కలిగిన హీరో దొరకడం.. కరణ్ జోహార్ (Karan Johar) లాంటి టాప్ ప్రొడ్యూసర్ ఆయనతో చేతులు కలపడంతో ‘లైగర్’ (Liger) మూవీ భారీ స్థాయిలో తెరపైకి వచ్చింది. 


‘లైగర్’ చిత్రం ఇలా అనౌన్స్ అయ్యీ అవగానే.. పూరీ తన కెరీర్‌లో ఎన్నడూ ఊహించని విధంగా విపరీతమైన క్రేజ్ వచ్చి పడింది. కానీ దాన్ని ఆయన పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయాడనే చెప్పాలి. ఎంతగానో ఈగర్‌గా వెయిట్ చేసి.. సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందనే ఊహాగానాలతో థియేటర్స్‌కి తరలివచ్చిన అభిమానుల్ని పూర్తిగా నిరాశకు గురి చేసే రేంజ్‌లో చాలా పూర్ ఔట్ పుట్ ఇచ్చాడు పూరీ. అసలు ఆయన నుంచి అంత తక్కువ స్థాయి సినిమాను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆడియన్స్. ఇంతకు ముందు ఆయన ఎన్నో డిజాస్టర్లు ఇచ్చినా.. వాటి గురించి మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ అంతగా రచ్చ జరగలేదు. తక్కువ బడ్జెట్‌తో, తక్కువ రోజుల్లో సినిమా తీయడం.. ఒక వేళ ఫ్లాప్ వచ్చినా నష్టం అంతగా జరగకపోవడంతో పూరీ బండి నడిచిపోయింది. అయితే లైగర్ ఆయనకు చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. 


ఈ సినిమాతో పూరీకి భారీ నష్టాలు తప్పడం లేదు. ఇకపై ఆయన్ను నమ్మి  స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూరీ తన కొడుకు ఆకాశ్‌ (Akash) ను హీరోగా పెట్టి ఓ కొరియన్ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈ దశలో ఆయనకు మరో దారి లేదనే చెప్పాలి. ‘మెహబూబా’ (Mehabooba) తో హీరోగా మారిన ఆకాశ్.. ఆ తర్వాత ‘రొమాంటిక్, చోర్ బజార్’ చిత్రాలతోనూ చేదు అనుభవాల్ని చవిచూశాడు. అతడితో సినిమాలు తీయడానికి కూడా ఇతర దర్శక నిర్మాతలు రెడీగా లేరు. ఈ నేపథ్యంలో కొడుకుతో తండ్రి, తండ్రితో కొడుకు జట్టుకట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు. మరి ఈ సినిమా తండ్రీ కొడుకు ఇద్దరికీ ఒకేసారి లక్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి. 

Updated Date - 2022-09-06T15:07:32+05:30 IST