Liger Mistakes: వాళ్లిద్దరి బలాలు ఉపయోగించలేదు.. అదే మైనస్ !

ABN , First Publish Date - 2022-08-27T00:51:53+05:30 IST

ఒక సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే అందులో తప్పులున్నా, లాజిక్‌లు మిస్‌ అయినా నడిచిపోతుంది. ప్రేక్షకులు ఫర్వాలేదు అంటారు. ఓ పెద్ద సినిమా, ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న ‘లైగర్‌’లాంటి చిత్రం డిజాస్టర్‌ అయితే ప్రతి సన్నివేశాన్ని గుచ్చి గుచ్చి చూస్తారు. ఈ విషయంపై మేకర్స్‌కు కూడా ఐడియా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తెలిసే పొరపాట్లు చేశారా అనిపిస్తుంటుంది.

Liger Mistakes: వాళ్లిద్దరి బలాలు ఉపయోగించలేదు.. అదే మైనస్ !

ఒక సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే అందులో తప్పులున్నా, లాజిక్‌లు మిస్‌ అయినా నడిచిపోతుంది. ప్రేక్షకులు ఫర్వాలేదు అంటారు. ఓ పెద్ద సినిమా, ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న ‘లైగర్‌’(Liger)లాంటి చిత్రం డిజాస్టర్‌ అయితే ప్రతి సన్నివేశాన్ని గుచ్చి గుచ్చి చూస్తారు. ఈ విషయంపై మేకర్స్‌కు కూడా ఐడియా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తెలిసే పొరపాట్లు చేశారా అనిపిస్తుంటుంది. ‘లైగర్‌’ (Liger)విషయంలో అదే జరిగిందని చెప్పుకుంటున్నారు. తనదైన శైలిలో డైలాగ్‌లు చెప్పడం విజయ్‌ దేవరకొండకి ఉన్న బలం. అతను డైలాగ్‌ చెబుతుంటే ప్రేక్షకులు మంత్ర ముగ్దులవుతారు. హీరోగా అతనికి సక్సెస్‌కి అదొక కారణం. అయితే లైగర్‌లో అతనికి మాటలే కరువయ్యాయి. ఎందుకంటే నత్తి పాత్ర కావడంతో ఎక్కువ డైలాగ్స్‌ లేకపోవడం సినిమాకు మైనస్‌ అయింది. అదే నిరాశలో ఉన్నారు విజయ్‌ అభిమానులు. (Liger Mistakes)


డాషింగ్‌ డైరెక్టర్‌ పూరికి బలం పంచ్‌ డైలాగ్‌లు. అతను రాసిన పంచ్‌ డైలాగ్‌ హీరో నోట పలికాడంటే  థియేటర్‌లో చప్పట్ల మోత మోగాల్సిందే! హీరో క్యారెక్టర్‌ని బలంగా చూపించడంతోపాటు ఆకట్టుకునే డైలాగ్‌లు రాయడం పూరి బలం. అటువంటి పూరి ‘లైగర్‌’ కోసం సాదాసీదా డైలాగ్‌లు రాశారు. హీరో, దర్శకుడు ఇద్దరూ కూడా వారి బలాలను నిర్లక్ష్యం చేశారని, వారిలో ప్లస్‌ అయిన పాయింట్స్‌ వదిలి వేరే దారిలో వెళ్లడం ఈ సినిమా డిజాస్టర్‌ కావడానికి కారణమని చెప్పుకుంటున్నారు. (Puri jaganadh plus points)


Updated Date - 2022-08-27T00:51:53+05:30 IST