Puri Jagannadh: గురూ.. మీ నాన్నను పరిచయం చేయవా అనడిగా!

ABN , First Publish Date - 2022-08-25T16:59:46+05:30 IST

పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పూరి కెరీర్‌ బిగినింగ్‌లో చిరంజీవితో ఆయనకున్న ఓ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. కూకట్‌పల్లిలో ఓ కుర్రాడు... చిరంజీవి–పూరి జగన్నాథ్‌ల మెగా పాన్‌(కిళ్లీ) కథను ఓ వీడియో రూపంలో చెప్పుకొచ్చారు.

Puri Jagannadh: గురూ.. మీ నాన్నను పరిచయం చేయవా అనడిగా!

పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పూరి కెరీర్‌ బిగినింగ్‌లో చిరంజీవితో ఆయనకున్న ఓ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. కూకట్‌పల్లిలో ఓ కుర్రాడు... చిరంజీవి–పూరి జగన్నాథ్‌ల మెగా పాన్‌(కిళ్లీ) కథను ఓ వీడియో రూపంలో చెప్పుకొచ్చారు. ‘లైగర్‌’ విడుదల సందర్భంగా సుకుమార్‌ చేసిన ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. పూరి జగన్నాథ్‌, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కి (Vijayendra prasad)సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. విజయేంద్రప్రసాద్‌కి పూరి జగన్నాథ్‌ అంటే చాలా ఇష్టమనీ, అతని ఫొటో తన స్ర్కీన్‌ సేవర్‌గా ఉంటుందని పలుమార్లు చెప్పారు. దర్శకుడు కాకముందు నుంచే పూరి, రాజమౌళి (Raja mouli)మంచి స్నేహితులని మరోసారి గుర్తు చేశారు. 


‘‘నేను సినిమాల్లోకి రాకముందు నుంచి రాజమౌళితో పరిచయం ఉంది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఓసారి  కృష్ణవంశీ చెన్నైలో రాజమౌళిని పరిచయం చేశాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ గారు పెద్ద రచయిత అని తెలుసు. ‘‘గురూ.. మీ నాన్నగారిని ఒక్కసారి చూడాలని ఉంది’’ అని రాజమౌళిని అడిగా. మరో సారి కలిసినప్పుడు రాజమౌళి నన్ను వాళ్లింటికి తీసుకువెళ్లాడు. ఆ సమయంలో విజయేంద్ర ప్రసాద్‌ గారు.. ఓ కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్నారు. ఆయన కుర్చీ వెనుక ఫొటోలు, సినిమా షీల్డ్స్‌, అవార్డులు ఉన్నాయి. ‘పరిచయం చేయనా?’ అని రాజమౌళి అడిగాడు. ‘వద్దులే బాగోదు’ అని చెప్పి వచ్చేశా. ఆ తర్వాత ఆయనతో పరిచయం పెరిగింది. నన్ను చాలా ఇష్టపడతారాయన. పైకి శత్రువుని అని చెబుతుంటారు. అది అబద్ధం’’ అని పూరి జగన్‌ సుకుమార్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 


Updated Date - 2022-08-25T16:59:46+05:30 IST