Puri jaganadh: ఛార్మి గురించి పూరి మాటల్లో..

ABN , First Publish Date - 2022-08-19T06:03:29+05:30 IST

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ మధ్య అనుబంధం గురించి చాలాకాలంగా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే! ఛార్మి, పూరి లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నారని సోషల్‌ మీడియా కోడై కూస్తుంది. అయితే ఈ విషయంలపై ఇరువురు ఎప్పుడూ స్పందించలేదు. ఈ విషయంలపై తాజాగా పూరి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Puri jaganadh: ఛార్మి గురించి పూరి మాటల్లో..

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌(Puri jagaznadh), ఛార్మి కౌర్‌ (Charmee ralation with charmee)మధ్య అనుబంధం గురించి చాలాకాలంగా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే! ఛార్మి, పూరి లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నారని సోషల్‌ మీడియా కోడై కూస్తుంది. అయితే ఈ విషయంలపై ఇరువురు ఎప్పుడూ స్పందించలేదు. ఈ విషయంలపై తాజాగా పూరి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘‘ఆమెకు 50 ఏళ్ల వయసుంటే ప్రజలు ఆ విషయం గురించి పెద్దగా మాట్లాడరు. ఆమెది భారీ పర్సనాలిటీ అయ్యి, మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా ఎవరికీ ఏ చింతా ఉండదు. కానీ ఆ అమ్మాడి వయసులో ఉంది. కాబట్టి, ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని లోకమంతా అనుకుంటున్నారు. ప్రతి జంటకు రొమాంటిక్‌ యాంగిల్‌, సెక్సువల్‌ ఎట్రాక్షన్‌ ఉంటుందని నమ్ముతా. అయితే ఆ ఫీలింగ్‌ చాలా త్వరగా చనిపోతుంది. మనలో చాలామందికి పెళ్లిళ్లు అయ్యాయి. ఆ కోరికలనేవి కొంతకాలానికి చనిపోతాయి కేవలం స్నేహం మాత్రమే ఎప్పటికీ ఉండిపోతుంది. ఈ అమ్మాయి 13ఏళ్ల వయసు నుంచి నాకు తెలుసు. అంటే దాదాపు నాకు 20 సంవత్సరాలుగా  తెలుసు. సినిమా కోసం ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు’’ అని ఛార్మితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఇక సినిమా విషయానికొస్తే.. ‘లైగర్‌’ పదేళ్ల క్రితం రాసిన కథ. ఈ కథ విజయ్‌కు చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాడు’’ అని పూరి జగన్నాథ్‌ అన్నారు. అనన్యా పాండే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని  ఈ నెల 25న ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. 





Updated Date - 2022-08-19T06:03:29+05:30 IST