పునీత్‌ నటిస్తున్న సినిమాలపై సందిగ్ధత

ABN , First Publish Date - 2021-11-02T17:17:27+05:30 IST

పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ హఠాన్మరణం చందనసీమను కోలుకోలేని విధంగా దెబ్బతీసిం ది. పునీత్‌ నటిస్తున్న 5 సినిమాలపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఈ సినిమాల బడ్జెట్‌ భారీగానే

పునీత్‌ నటిస్తున్న సినిమాలపై సందిగ్ధత

                - విడుదలకు సిద్ధంగా మూడు సినిమాలు


బెంగళూరు(Karnataka): పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ హఠాన్మరణం చందనసీమను కోలుకోలేని విధంగా దెబ్బతీసిం ది. పునీత్‌ నటిస్తున్న 5 సినిమాలపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఈ సినిమాల బడ్జెట్‌ భారీగానే ఉంటుందని చందనసీమ వర్గాలు అంటున్నాయి. చేతన్‌కుమార్‌ దర్శకత్వంలో జేమ్స్‌ సినిమా 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక కేవలం 10 శాతం పూర్తి కావాల్సిన తరుణంలో పునీత్‌ అకాల మరణం చిత్ర యూనిట్‌ను విషాదసాగరంలో ముంచింది. ఇప్పటికే ఈ సినిమా కోసం రూ.8కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇక ద్విత్వ సినిమా షూటింగ్‌ కూడా ఇటీవలే ప్రారంభమైంది. చిత్రీకరణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోనే షాక్‌ తగిలింది. ఇవి కాక పహిల్వాన్‌ దర్శకుడు కృష్ణతో ఒక సినిమా చేయనున్నట్టు పునీత్‌ గతంలోనే ప్రకటించారు. తాను ఆ చిత్రంలో రా ఏజెంట్‌గా పాత్ర పోషించబోతున్నట్టు, నేపాల్‌, బంగ్లాదేశ్‌లో చిత్రీకరణ జరుగుతుందని ప్రకటించారు. దినకర్‌ తూగుదీప దర్శకత్వంలో మరో సినిమా కూడా పునీత్‌ హీరోగా నటించనున్నట్టు ఇప్పటికే ప్రకటన వెలువడింది. పృథ్వి ఫేం దర్శకుడు జేకబ్‌ వర్గీస్‌తో కలసి ఓ సినిమాలో నటించేందుకు కూడా పునీత్‌ అంగీకరించారు. తమ సొంత పతాకంపై ఫ్యామిలీ ప్యాక్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, వన్‌ కట్‌ టూ కట్‌ సినిమాలను కూడా పునీత్‌ నిర్మించారు. ఈ మూడు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అప్పు ఇక లేరన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న చందనసీమ పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చునని భావిస్తున్నారు. పునీత్‌ చేపట్టిన సినిమాలను పూర్తి చేసే బాధ్యతను అన్న డాక్టర్‌ శివరాజ్‌కుమార్‌ స్వీకరించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌తో కలసి నటించాలని అనేకమంది యువ హీరోలు ప్రయత్నించినప్పటికీ ఒక దర్శన్‌కు మాత్రమే అదృష్టం దక్కింది. అరసు చిత్రంలో పునీత్‌తో కలసి దర్శన్‌ నటించారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ సోదరులు శివరాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌లు ఒకే చిత్రంలో కలసి నటించారు. అయితే ముగ్గురు అన్నదమ్ములు కలసి నటించే అవకాశం రాకపోవడం నిజంగా విచిత్రమే. 

Updated Date - 2021-11-02T17:17:27+05:30 IST