విధిరాతను ఎవరూ మార్చలేరు.. చావు, భవిష్యత్ గురించి Puneeth Rajkumar గతంలో చేసిన వ్యాఖ్యలివి

ABN , First Publish Date - 2021-10-29T23:50:17+05:30 IST

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌‌కుమార్.. గుండె పోటుతో అకాల మరణం చెందిన విషయం తెలిసింది. ఆయన మరణ వార్త.. సినీ అభిమానులను శోకసంద్రంలో పడేసింది. దీంతో ఆయనకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులర్పిస్తూ ట్వీట్లు చేస్తున్నారు

విధిరాతను ఎవరూ మార్చలేరు.. చావు, భవిష్యత్ గురించి Puneeth Rajkumar గతంలో చేసిన వ్యాఖ్యలివి

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌‌కుమార్.. గుండె పోటుతో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త.. సినీ అభిమానులను శోకసంద్రంలో పడేసింది. దీంతో ఆయనకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులర్పిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్‌కమార్.. భవిష్యత్తును గురించి గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాటలను గుర్తు చేసుకుంటూ అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతన్నారు. 



కన్నడ పవర్ స్టార్ పునీత్ కాజ్‌కుమార్.. గతంలో ఓ ఇంటర్యూలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగానే భవిష్యత్తు గురించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భవిష్యత్తు మన చేతిలో లేదు. గతాన్ని వెనక్కి తీసుకురాలేం. విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. దాన్ని ఎవరూ మార్చలేరు’ అని పేర్కొన్నారు. అప్పట్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలను గుర్తు చేసుకుని అభిమానులు కంటతడి పెడుతున్నారు. ‘మీరు లేరనే వార్తను నమ్మలేకపోతున్నాం. ఈ చేదు వార్త నిజం కాకూడదు.. ప్లీజ్ పునీత్ తిరిగి రా’ అంటూ కామెంట్  చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా పునీత్ రాజ్‌కుమార్‌కు గుండె పోటు వచ్చింది. నొప్పితో బాధపడుతున్న ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యం విషమించి ఆయన కన్నుమూశారు. 


Updated Date - 2021-10-29T23:50:17+05:30 IST