Janaganamana (JGM) : కథానాయికగా క్రేజీ బ్యూటీ?

ABN , First Publish Date - 2022-05-06T17:10:06+05:30 IST

ప్రస్తుతం జాతీయస్థాయిలో బిజీగా ఉన్న బ్యూటీ పూజాహెగ్డే. ఇప్పుడు ఆమె నటిస్తున్నవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. వాటిలో కొన్ని రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇంకొన్ని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మరికొన్ని సెట్స్‌పై ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో అమ్మడి జోరు మామూలుగా లేదు.

Janaganamana (JGM) : కథానాయికగా క్రేజీ బ్యూటీ?

ప్రస్తుతం జాతీయస్థాయిలో బిజీగా ఉన్న బ్యూటీ పూజాహెగ్డే. ఇప్పుడు ఆమె నటిస్తున్నవన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. వాటిలో కొన్ని రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఇంకొన్ని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మరికొన్ని సెట్స్‌పై ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో అమ్మడి జోరు మామూలుగా లేదు. ఇటీవల పూజా నటించిన పలు భారీ చిత్రాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. వాటిలో రెండు పాన్ ఇండియా చిత్రాలే ఉన్నాయి. ప్రభాస్ ‘రాధేశ్యామ్’, దళపతి విజయ్ ‘బీస్ట్’ మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాలు అభిమానులకు తీవ్రంగా నిరాశ కలిగించాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆమె నటించబోయే మరో పాన్ ఇండియా మూవీ JanaganamanaM (JGM). రౌడీ హీరో విజయ్, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో ఈ సినిమా ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ అయింది. త్వరలోనే చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 


దేశభక్తిని, యాక్షన్ ను మిళితం చేస్తూ రూపొందించబోయే Janaganamana (JGM) చిత్రంలో కథానాయికగా పూజాహెగ్డే అయితే అన్ని విధాలా బాగుంటుందని పూరీ ఆమెను సంప్రదించాడట. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కానుంది. అయితే వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో చేదు అనుభవం చవిచూసిన పూజాను Janaganamana (JGM) చిత్రంలో కథానాయికగా ఎంపిక చేయడం బ్యాడ్ సెంటిమెంట్‌గా ఫీలవుతున్నారు అభిమానులు. అయినప్పటికీ ఈ విషయంలో పూరీ తన నిర్ణయం మార్చుకోనట్టే కనిపిస్తోంది. ఆమెను హీరోయిన్‌గా ఈ సినిమాలో దాదాపు ఖాయం చేశారట. 


ప్రస్తుతం విజయ్, పూరీ కలయికలో ‘లైగర్’ చిత్రం రూపొందుతోంది. ఇందులో విజయ్ బాక్సర్‌గా ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రను పోషిస్తున్నాడు. దానికోసం జిమ్ లో గంటల తరబడి కష్టపడి .. సిక్స్ ప్యాక్ కూడా బిల్డ్ చేశాడు విజయ్. ఈ సినిమాతో పూరీ, విజయ్‌ల మధ్య రిలేషన్ బాగా కుదిరింది. అందుకే మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతోంది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ నటించే చిత్రం కావడంతో లైగర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గానీ సూపర్ హిట్ అయితే...  Janaganamana (JGM) చిత్రానికది మంచి అడ్వాంటేజ్ గా మారుతుంది. మరి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, పూజా హెగ్డేల ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ ఏ స్థాయిలో వర్కవుట్ అవుతుందో చూడాలి.  

Updated Date - 2022-05-06T17:10:06+05:30 IST