PS 1: ఐమ్యాక్స్ ఫార్మాట్ లో మొదటి తమిళ చిత్రం..

ABN , First Publish Date - 2022-08-17T17:36:05+05:30 IST

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Manirathnam) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న భారీ హిస్టారికల్ మూవీ 'పొన్నియిన్ సెల్వన్-1' (Ponniyin-Selvan-I).

PS 1: ఐమ్యాక్స్ ఫార్మాట్ లో మొదటి తమిళ చిత్రం..

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Manirathnam) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న భారీ హిస్టారికల్ మూవీ 'పొన్నియిన్ సెల్వన్-1' (Ponniyin-Selvan-I). ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో ఈ సెప్టెంబర్ నెలలో విడుదల చేయబోతున్నారు. అయితే, తాజాగా మేకర్స్ ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. 'కల్కి' నవల సిరీస్ ఆధారంగా ఈ చిత్రాన్ని మణిరత్నం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  


ఈ మూవీలో విక్రమ్ (Vikram), కార్తీ (Karthi), జయం రవి (Jayam Ravi), త్రిష (Trisha), ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఐమ్యాక్స్ ఫార్మాట్ లో విడుదలవుతున్న మొదటి తమిళ చిత్రంగా పీఎస్ 1 నిలవనుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఐమ్యాక్స్ ఫార్మాట్ లో విడుదల చేయబోతున్న విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వివరాలను తెలిపింది. "గ్రాండ్ గెట్స్ గ్రాండ్! ఐమ్యాక్స్‌లో పీఎస్ 1 అనుభూతిని పొందండి... ఐమ్యాక్స్‌లో రిలీజ్ అవబోతున్న మొదటి తమిళ చిత్రమిది.


సెప్టెంబర్ 30 వ తేదీన థియేటర్లలో వస్తోంది''..! అని వెల్లడించారు. కాగా, మొదటి భాగంలోని కథ మొత్తం అరుల్ మోజివర్మన్ (జయం రవి) చుట్టూ తిరుగుతుందట. అతను తిరుగుబాటుకు వ్యతిరేకంగా చోళ రాజ్య సింహాసనాన్ని ఎలా అధిరోహించాడో తెరపై దర్శకుడు మణిరత్నం అద్భుతంగా చూపించబోతున్నారు. దర్శకుడిగా మణిరత్నం భారీ హిట్ అందుకొని చాలా కాలం అయింది. మరి సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి. 



Updated Date - 2022-08-17T17:36:05+05:30 IST