Ramarao On Duty: నా పేరు సీసా.. ఐటమ్ ప్రోమో అదిరింది

Twitter IconWatsapp IconFacebook Icon
Ramarao On Duty: నా పేరు సీసా.. ఐటమ్ ప్రోమో అదిరింది

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి (SLV Cinemas LLP), రవితేజ టీం వర్క్స్ (RT Team works) బ్యానర్లపై.. శరత్ మండవ (Sarath Mandava) దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు చిత్ర ప్రచార కార్యక్రమాలను కూడా మేకర్స్ యమా జోరుగా సాగిస్తున్నారు. అందులో భాగంగా, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. ఇప్పుడు థర్డ్ సింగిల్‌‌తో సందడి చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. జూలై 2వ తేదీన థర్డ్ సింగిల్‌ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. తాజాగా ఆ పాటకి సంబంధించిన ప్రోమోని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ప్రోమో ప్రస్తుతం మాస్ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


చూస్తుంటే ఈ పాట ఐటమ్ సాంగ్ అని తెలుస్తుంది. ఐటమ్ భామగా అన్వేషి జైన్ (Anveshi Jain) గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఈ ప్రోమోలో ఆమె కనిపించిన విధానం.. ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూసేలా చేస్తోంది. ‘నా పేరు సీసా’ (Naa Peru Seesa).. అనే లిరిక్స్‌తో సాగిన ఈ పాటని సామ్ సిఎస్ (Sam CS) మాస్ డ్యాన్సింగ్ నెంబర్‌గా కంపోజ్ చేయగా.. శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal), సామ్ సిఎస్ ఫుల్ ఎనర్జీటిక్‌గా ఆలపించారు. చంద్రబోస్ (Chandrabose) సాహిత్యం అందించారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రవితేజ సరసన రజిషా విజయన్ (Rajisha Vijayan), దివ్యాంశ కౌశిక్‌ (Divyasha Kaushik) హీరోయిన్లుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్ తదితరులు ఇతర పాత్రలలో కనిపించనున్నారు.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.