Project-K: షూట్‌పై లేటెస్ట్ అప్‌డేట్..

ABN , First Publish Date - 2022-08-12T16:59:37+05:30 IST

ప్రాజెక్ట్ కె (Project K) మూవీ షూట్‌పై చిత్ర నిర్మాత సి అశ్వనీదత్ (C Ashani Dutt) తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ స్టార్స్ దీపిక పడుకొన్ (Deepika Padukone),

Project-K: షూట్‌పై లేటెస్ట్ అప్‌డేట్..

ప్రాజెక్ట్ కె (Project K) మూవీ షూట్‌పై చిత్ర నిర్మాత సి అశ్వనీదత్ (C Ashani Dutt) తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ స్టార్స్ దీపిక పడుకొన్ (Deepika Padukone), బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitab Bacchan) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రమిది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్ పతాకంపై సి అశ్వనీ దత్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ మేకర్స్ నుంచి రావడం లేదు. దాంతో మధ్యలో షూటింగ్ ఆగిపోయింది అని కూడా నెట్టింట ప్రచారం జరిగింది. 


అంతేకాదు, ఈ సినిమా షూటింగ్ కోసమే రెండేళ్ళ సమయం పడుతుందని, రిలీజ్ ఎప్పుడో క్లారిటీ కూడా ఇప్పట్లో రావడం కష్టమని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా చిత్ర నిర్మాత అశ్వనీదత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇప్పటికే దాదాపు 55 శాతం చిత్రీకరణ పూర్తైందని చెప్పారు. ఇటీవల మరో షెడ్యూల్ కూడా ప్లాన్ చేశాము. కానీ కుదరలేదు. అది కూడా అయి ఉంటే ఇంకా టాకీపార్ట్ ఎక్కువ శాతమే పూర్తయ్యేది అని తెలిపారు.


దాంతో ఇన్నిరోజుల నుంచి ప్రాజెక్ట్ కె మూవీ గురించి వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టినట్టైంది. ఇక నిర్మాత చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రాజెక్ట్ కె వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి మేకర్స్ ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో. కాగా, ప్రభాస్ ఇప్పుడు సలార్, ఆది పురుష్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. సలార్ షూటింగ్ దశలో ఉండగా..ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయాల్సిన సినిమా ప్రకటన కూడా రావాల్సి ఉంది. 

Updated Date - 2022-08-12T16:59:37+05:30 IST