Project k : మేజర్ షెడ్యూల్ పూర్తి

ABN , First Publish Date - 2022-05-18T13:59:16+05:30 IST

పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం పలు భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రం ఇదివరకే టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా... ప్రశాంత్ నీల్ ‘సలార్’ (Salaar) చిత్రం 30 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక ప్రభాస్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ మరో భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ (Project k).

Project k : మేజర్ షెడ్యూల్ పూర్తి

పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం పలు భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్  ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రం ఇదివరకే టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా... ప్రశాంత్ నీల్ ‘సలార్’ (Salaar) చిత్రం 30 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక ప్రభాస్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ మరో భారీ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ (Project k). వైజయంతి మూవీస్ సంస్థ 50వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ (Nag ashwin)  దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే (Deepika padukone) కథానాయికగా నటిస్తుండగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitab bachan) కీలక పాత్ర పోషిస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమాను వైవిధ్యంగా రూపొందిస్తున్నాడు దర్శకుడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రాజెక్ట్ కె చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


‘ప్రాజెక్ట్ కె’ (Project k) చిత్రానికి సంబంధించి ప్రభాస్ ఇంట్రడక్షన్ సన్నివేశంతో కూడిన మేజర్ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ జూన్ నెలాఖరులో ప్రారంభం కానుంది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం కథానాయికుడు ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు. గత చిత్రాలకు భిన్నంగా మేకోవరయి.. దానికి అనుగుణంగానే తన శరీరాన్ని మలుచుకున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర అభిమానుల్ని అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయబోతున్నారు. ‘ఆదిత్య 369 (Aditya 369) , ప్లే బ్యాక్ (Play back), అద్భుతం (Adbhutham) చిత్రాల తర్వాత టాలీవుడ్‌లో విడుదల కానున్న మరో టైమ్ ట్రావెల్ చిత్రం ఇదే కావడం విశేషం. అయితే ఇందులో ప్రభాస్ హీరో కాబట్టి.. భారీ అంచనాలు నెలకొన్నాయి. 


పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘ప్రాజెక్ట్ కె’ (Project k)  చిత్రం విడుదల కాబోతోంది. టైమ్ ట్రావెల్ కథాంశం యూనివర్సల్ పాయింట్ కాబట్టి.. ఈ కాన్సెప్ట్ అన్ని భాషల వారినీ అలరిస్తుందని వేరే చెప్పాలా? ఒకే పేరుతో అన్నిభాషల్లోనూ విడుదల కానుంది. అక్కినేని ఫ్యామిలీ వారి మెమరబుల్ మూవీ  ‘మనం’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించిన అమితాబ్ బచ్చన్.. ఈ సినిమాలో ఫుల్‌లెంత్ రోల్‌లో అలరించబోతున్నారు. ‘మహానటి’ (Mahanati)  బ్లాక్ బస్టర్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మరింతగా హైపు క్రియేట్ అయింది. 

Updated Date - 2022-05-18T13:59:16+05:30 IST