అంతరిక్షంలో సినిమా స్టూడియో... భూమికి ఆవల lights camera action

ABN , First Publish Date - 2022-01-22T01:03:03+05:30 IST

హాలీవుడ్ సరికొత్త హద్దుల్ని ముద్దాడబోతోంది. భూమిని దాటుకుని అంతరిక్షంలో ‘లైట్స్... కెమెరా... యాక్షన్’కి రెడీ అవుతోంది. అయితే, టామ్ క్రుయిజ్ హీరోగా త్వరలో స్పేస్ మూవీ ఒకటి నిర్మాణం కానున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కొత్త అప్‌డేట్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది...

అంతరిక్షంలో సినిమా స్టూడియో... భూమికి ఆవల lights camera action

హాలీవుడ్ సరికొత్త హద్దుల్ని ముద్దాడబోతోంది. భూమిని దాటుకుని అంతరిక్షంలో ‘లైట్స్... కెమెరా... యాక్షన్’కి రెడీ అవుతోంది. అయితే, టామ్ క్రుయిజ్ హీరోగా త్వరలో స్పేస్ మూవీ ఒకటి నిర్మాణం కానున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో కొత్త అప్‌డేట్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది... 


టామ్ క్రుయిజ్‌తో అంతరిక్షంలో సినిమా నిర్మించాలని ప్రయత్నాలు చేస్తోన్న ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ ఇప్పుడు రోదసీలోనే స్టూడియో కూడా సిద్ధం చేసుకుంటామని ప్రకటించింది. ఇప్పటికే భూమి చుట్టూ చక్కర్లు కొడుతోన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు దాన్ని అనుసంధానిస్తారట. హూస్టన్‌లోని ‘ఆక్జియోమ్’ సంస్థ ప్రపంచపు మొట్ట మొదటి స్పేస్ స్టూడియో డిజైన్ చేయనుంది. ‘స్పేస్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజ్’ (ఎస్ఈఈ) అంటారు ఈ న్యూ సెటప్‌ని. కేవలం సినిమా నిర్మాణానికే కాక బ్రాడ్‌కాస్ట్, లైవ్ స్ట్రీమింగ్ లాంటి అంశాల్లో ఫిల్మ్, టెలివిజన్, మ్యూజిక్, స్పోర్ట్స్ ప్రాజెక్ట్స్‌కి భవిష్యత్తులో ఈ స్టూడియో ఉపయోగపడనుంది... 

Updated Date - 2022-01-22T01:03:03+05:30 IST