Chiranjeevi: రెమ్యునరేషన్‌ ఎంత? రీఎంట్రీ తర్వాత మెగా లెక్కలు మారాయా?

ABN , First Publish Date - 2022-08-18T19:20:14+05:30 IST

మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు సినిమాలో టాప్‌ ప్లేస్‌లో ఉండి, అక్కడి నుంచి దశాబ్ద కాలం సినిమాలను వదిలేసి వెళ్ళిన మెగాస్టార్‌ చిరంజీవి... మళ్లీ ‘ఖైది నంబర్‌ 150’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇండస్ర్టీలోకి తిరిగొచ్చిన చిరు, బ్యాక్‌ టు బ్యాక్‌ సొంత బ్యానర్‌ అయిన కొణిదెల ప్రొడక్షన్స్‌లోనే సినిమాలను చేస్తున్నారు.

Chiranjeevi: రెమ్యునరేషన్‌ ఎంత? రీఎంట్రీ తర్వాత మెగా లెక్కలు మారాయా?

మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు సినిమాలో టాప్‌ ప్లేస్‌లో ఉండి, అక్కడి నుంచి దశాబ్ద కాలం సినిమాలను  వదిలేసి వెళ్ళిన మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)... మళ్లీ ‘ఖైది నంబర్‌ 150’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇండస్ర్టీలోకి తిరిగొచ్చిన చిరు, బ్యాక్‌ టు బ్యాక్‌ సొంత బ్యానర్‌ అయిన కొణిదెల ప్రొడక్షన్స్‌లోనే సినిమాలను చేస్తున్నారు. ‘ఖైదీ’, ‘సైౖరా’, ‘ఆచార్య’ వరకూ అన్నీ సొంత సినిమాలే.  సొంత నిర్మాణ సంస్థ సినిమాలు కావడం వలన చిరు ఎంత తీసుకుంటున్నారు అనేది బయటకు తెలీదు. కానీ... ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న సినిమాలన్నీ బయటి బ్యానర్‌లవే! ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌, ‘భోళా శంకర్‌’ను ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌, మెగా 154 మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలు సినిమాల నిర్మాతలకు ఉన్న కన్‌ఫ్యూజన్‌ అసలు మెగాస్టార్‌కి ఎంత రెమ్యునరేషన్‌ ఇవ్వాలి? చిరు రెమ్యునరేషన్‌ ఒకరు డిసైడ్‌ చేస్తారా? కష్టం కదా అందుకే నిర్మాతలు స్వయంగా చిరు దగ్గరికే వెళ్లి సర్‌, మీరు ఎంత రెమ్యునరేషన్‌ (Chiranjeevi remuneration)తీసుకుంటారు? అని అడిగారట. ఇప్పటివరకూ సొంత సినిమాలే చేస్తూ వచ్చిన చిరుకి ఎంత ఫిగర్‌ చెప్పాలి అనేది అర్థం కానీ విషయంగా ఉందట. ఎందుకంటే ఒక యాబై అరవై కోట్లు ఇవ్వండి అంటే... పవన్‌ కళ్యాణ్‌ ప్రభాస్‌, ఎన్టీఆర్‌, చరణ్‌, అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోల కన్నా చిరు తక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారు అనే టాక్‌ బయటకి వస్తుందేమో? పోని ఓ వంద కోట్లు చెప్తే, సినిమా ఆడట్లేదు అయినా చిరు మాత్రం చుక్కలు చూపించే రెమ్యునరేషన్‌ అడుగుతున్నాడని అంతా అనుకుంటారేమో అనే భయంతో చిరు... అసలు ఈ గోల అంతా ఎందుకు ముందు సినిమాలు కంప్లీట్‌ చేద్దాం రెమ్యునరేషన్‌ విషయం తర్వాత చూసుకుందాం అని చెప్తున్నారట.


ఏ ప్రొడ్యూసర్‌ వెళ్లినా, చిరు నుంచి వస్తున్న మాట ఇదొక్కటే అని ఇన్సైడ్‌ టాక్‌. సరేలే రిలీజ్‌ టైంలో చూసుకుందాం అని నిర్మాతలు రిలాక్స్‌ అవ్వడానికి లేదు.. ఎందుకంటే తీరా రిలీజ్‌ టైంలో చిరు.. సడన్‌గా నైజం రైట్స్‌ కానీ ఇంకేదైనా రైట్స్‌ కానీ అడిగితే.. ఈ రెండు కాకుండా తన కొణిదెల ప్రొడక్షన్స్‌ని పార్టనర్‌ చేస్తే ఏం చేయాలి? చేసేదేమీ లేదు. తేలు కుట్టిన దొంగలాగా సైలెంట్‌గా చిరు ఏది అడిగితే అది చేసేయడమే ప్రొడ్యూసర్స్‌ చేతిలో ఉన్నది. ఏది ఏమైనా బిగ్గర్‌ దెన్‌ బచ్చన్‌, ఫస్ట్‌ హీరో టు టేక్‌ వన్‌ క్రోర్‌ రెమ్యునరేషన్‌ అనే పేరున్న మెగాస్టార్‌ (Megastar chiranjeevi)లాంటి హీరోకి ఈ రెమ్యునరేషన్‌ కష్టాలు రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే! 


Updated Date - 2022-08-18T19:20:14+05:30 IST