నిర్మాతకు ఏదీ భారం కాకూడదు : Dil Raju

ABN , First Publish Date - 2022-08-04T20:30:15+05:30 IST

థియేటర్స్ లో విపీయస్ చార్జీలు ఎంతుండాలి? సినిమా ఎన్ని వారాల తర్వాత ఓటీటీకి వెళితే బాగుంటుంది? లాంటి పలు అంశాలపై తెలుగు ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ (Telugu Film Chamber Of Commerce Committee) ఈ రోజు (గురువారం) భేటీ అయింది.

నిర్మాతకు ఏదీ భారం కాకూడదు : Dil Raju

థియేటర్స్ లో విపీయస్ చార్జీలు ఎంతుండాలి? సినిమా ఎన్ని వారాల తర్వాత ఓటీటీకి వెళితే బాగుంటుంది? లాంటి పలు అంశాలపై తెలుగు ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ (Telugu Film Chamber Of Commerce Committee) ఈ రోజు (గురువారం) భేటీ అయింది. అందులో అనేక అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. సమావేశం అనంతరం దిల్ రాజు (Dil Raju) అనేక అంశాల్ని మీడియాతో పంచుకున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ...


‘నిర్మాతలం అందరం కలిసి షూటింగ్స్ ఆపేశాం. మేం ప్రస్తుతం నాలుగు అంశాలపై చర్చిస్తున్నాం. సినిమాలు ఓటీటీలోకి ఎన్నివారాలకు వెళితే ఇండస్ట్రీకి మంచిది అనే విషయంలో కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీ ఓటీటీకి సంబంధించిన దానిపై పనిచేస్తోంది. థియేటర్స్ లో విపీఎఫ్ చార్జీలు, పెర్సంటేజీలు ఎలా ఉండాలి అనేదానిపై కమిట్ వేశాం. ఆ కమిటీ ఎగ్జిబిటర్స్ తో మాట్లాడుతుంది.ఆ తర్వాత ఫెడరేషన్ వేజెస్, వర్కింగ్ కండీషన్స్ పై కూడా కమిటీ వేశాం. అలాగే నిర్మాతలకు ప్రొడక్షన్ వేస్టేజ్‌లో తగ్గింపు, వర్కింగ్ కండీషన్స్, షూటింగ్స్ నెంబరాఫ్ అవర్స్ జరగాలంటే ఏం చేయాలన్నదానిపై కూడా కమిటీ వేశాం. ఫిల్మ్ చాంబర్ లో ఈ నాలుగు అంశాల మీద నాలుగు కమిటీలు వేశాం. ప్రస్తుతం అవి పనిచేస్తున్నాయి. కానీ కొందరు సోషల్ మీడియాలో ఏవేవో రాస్తున్నారు. మా అందరికీ నెలల తరబడి షూటింగ్స్ ఆపాలన్న ఉద్దేశం లేదు. నిర్మాతకు ఏదీ భారం కాకూడదు. గత మూడు రోజుల నుంచి మూడు నాలుగు మీటింగ్స్ జరిగాయి. నాలుగు కమిటీలు చాలా హోమ్ వర్క్ చేస్తున్నాయి. తెలుగు సినిమా ఎలా ఉండాలనేది వర్క్ చేస్తున్నాం. త్వరలో ఆ రిజల్ట్ వస్తుంది’.. అని దిల్ రాజు పేర్కొన్నారు. 


నిర్మాత సి.కళ్యాణ్ (C. Kalyan) మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమా ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతలమందలి తరుపున.. మేమంతా షూటింగ్ ఆపుకొని సమస్యల పరిష్కారంకై కృషి చేస్తున్నాం.. మా నిర్మాతలు అందరికి విన్నపం.. ఎవరు ఏం చెప్పినా వినకండి. వారం పది రోజులుల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. గిల్డ్,  నిర్మాతలమండలి , ఫిలిం ఛాంబర్ అంతా ఒక్కటే.. వర్క్ డివైడ్ చేసుకుని పని చేస్తున్నాం’.. అన్నారు.  

Updated Date - 2022-08-04T20:30:15+05:30 IST