Macherla Niyojakavargam: పోలీస్ స్టేషన్‌కు దర్శకుడు, నిర్మాత!

ABN , First Publish Date - 2022-07-28T01:10:42+05:30 IST

యంగ్ హీరో నితిన్ (Nithiin) మాస్ అవతారం ఎత్తి చేస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) అనే కొత్త

Macherla Niyojakavargam: పోలీస్ స్టేషన్‌కు దర్శకుడు, నిర్మాత!

యంగ్ హీరో నితిన్ (Nithiin) మాస్ అవతారం ఎత్తి చేస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) అనే కొత్త  దర్శకుడు  డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ సూపర్బ్ సాంగ్స్‌తో  సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన దర్శకుడు.. తాజాగా ఈ సినిమా వివాదంలోకి వెళ్లడానికి కారణమయ్యాడు. విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ మూవీ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి చేసిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు బయటకి వచ్చాయి. డైరెక్టర్ రాజశేఖర్.. 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రిగా గెలిచిన వెంటనే.. కమ్మ, కాపు కులస్థులను బూతులు తిడుతున్నట్లుగా ఆ ట్వీట్స్ ఉన్నాయి. ఒక సినీ సెలబ్రిటీ ఈ రేంజ్‌లో ట్వీట్స్ పెడతాడని ఎవరు ఊహించరు. ఆ ఒక్కటే కాకుండా టీడీపీని కించపరిచేలా రెడ్డిలను పొగుడుతూ రాజశేఖర్ అకౌంట్‌లో చాలా ట్వీట్స్ ఉన్నాయి. ఇదే ఇప్పుడు నితిన్ సినిమాని కష్టాల్లో పడేసింది.


అలాగే ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలో కూడా హీరోకు రెడ్డి అని పేరు తగిలించి, రారా రెడ్డి అనే సాంగ్ పెట్టి.. కేవలం రెడ్డి కులస్థులను మాత్రమే పొగుడుతూ మిగతా వారిని కించపరుస్తున్నట్లు చూపిస్తున్నాడని, అందుకే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ #BanMacherlaNiyojakavargam ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంకొన్ని రోజులలో రిలీజ్ కాబోతుండగా.. తాజాగా ఈ వివాదం నితిన్ మెడకు చుట్టుకున్నట్లు అయ్యింది. దీంతో ఏకంగా నితినే రంగంలోకి దిగాడు. అవన్నీ ఫేక్ ట్వీట్స్ అని, ఎవరో కావాలనే ఈ ట్వీట్స్ చేస్తున్నారని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా అవన్నీ ఫేక్ ట్వీట్స్ అని ఆధారాలతో సహా చెప్పుకొచ్చాడు. 


మరోపక్క డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అవన్నీ ఫేక్ ట్వీట్స్ అని చెప్పడానికి ట్రై చేశాడు. ఆ స్క్రీన్ షాట్స్‌లో ఉన్న పేరు, తన పేరు వేరని, తాను జగన్ అభిమాని అన్న మాట వాస్తవమే కానీ.. వేరే కులస్థులను కించపర్చలేదని చెప్పుకొచ్చాడు. తన పేరు మీద ఫేక్ అకౌంట్‌తో తప్పుడు ప్రచారం చేస్తూ, కులాల మధ్య చిచ్చ పెడుతున్నారని తెలుపుతూ.. సదరు ట్వీట్స్‌పై చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డితో కలిసి వెళ్లి మరీ  పోలీసులకు దర్శకుడు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. డైరెక్టర్ అయితే నాకు సంబంధం లేదని చెప్తున్నాడు కానీ.. ఆ మాటల్ని ప్రజలు ఎంత వరకూ నమ్ముతారు,  ఈ బ్యాన్ మాచర్ల నియోజకవర్గం ట్యాగ్ ఇంకా ఎంత దుమారం లేపుతుంది. ఈ ఎఫెక్ట్ సినిమాపై, నితిన్ పై ఏ మేరకు ఉంటుంది అనే విషయం తెలియాలి అంటే ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.



Updated Date - 2022-07-28T01:10:42+05:30 IST