Vijay Deverakonda: విజయ్ దేవరకొండకి ఇంకా తప్పని బాధలు

ABN , First Publish Date - 2022-09-17T18:02:34+05:30 IST

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఎన్నో అంచనాలు పెట్టుకున్న లైగర్ (Liger) సినిమా బాక్సాఫీస్ (Box Office) వద్ద తలకిందులు అవ్వటంతో చాలా నిరాశ పడ్డాడు. కానీ, వెంటనే తేరుకొని..

Vijay Deverakonda: విజయ్ దేవరకొండకి ఇంకా తప్పని బాధలు

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఎన్నో అంచనాలు పెట్టుకున్న లైగర్ (Liger) సినిమా బాక్సాఫీస్ (Box Office) వద్ద తలకిందులు అవ్వటంతో చాలా నిరాశ పడ్డాడు. కానీ, వెంటనే తేరుకొని.. తదుపరి సినిమా ఖుషి (Khushi) షూటింగ్ ప్రారంభించాడు. ఈ సినిమా చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయింది.. కానీ ఈ సినిమాకి కూడా మళ్ళీ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇందులో నటిస్తున్న కథానాయిక సమంత (Samantha)కి ఏవో సమస్యలు రావటంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. ఆమె ఎప్పుడు వస్తుందా? అని విజయ్ మరియు ఇతర యూనిట్ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆమె ఇప్పట్లో  వచ్చేటట్టు కనిపించటం లేదు. 


విషయం ఏంటంటే ఆమెకి ఇంతకు ముందు వచ్చినట్టుగా మొహానికి ఏదో స్కిన్ ప్రాబ్లెమ్ వచ్చిందని, దానికి చికిత్స చేయించుకుంటోందని.. అందువల్ల ఆమె షూటింగ్‌కి రావటానికి చాలా టైం పడుతుందని అంటున్నారు. అసలే పాపం ‘లైగర్’ పోయి బాధలో వున్న విజయ్‌కి ఈ సినిమా చాలా లేట్ అవుతుందని తెలిసి, ఏమి చేయాలో పాలు పోవటం లేదట. ఈ సినిమాకి శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం చేస్తున్నాడు. సమంత లేకుండా వున్న సీన్స్ అన్నీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈమధ్య షూటింగ్ పూర్తి చేసేశాడు కూడా. తన వంతు కృషి తాను చేస్తున్నాడు విజయ్. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా మరి. ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితిలో ఈ సినిమా వుందిప్పుడు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.



Updated Date - 2022-09-17T18:02:34+05:30 IST