Priyanka Chopra సోషల్ మీడియా అకౌంట్‌కు సాంకేతిక సమస్య.. పునరుద్ధరించిన ఇన్‌స్టాగ్రామ్..

ABN , First Publish Date - 2022-06-23T23:39:48+05:30 IST

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటించి గ్లోబల్ నటిగా ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ ప్రియాంక చోప్రా(Priyanka Chopra). అభిమానులతో టచ్‌లో ఉండటానికి సోషల్ మీడియాలో

Priyanka Chopra సోషల్ మీడియా అకౌంట్‌కు సాంకేతిక సమస్య.. పునరుద్ధరించిన ఇన్‌స్టాగ్రామ్..

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటించి గ్లోబల్ నటిగా ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ ప్రియాంక చోప్రా(Priyanka Chopra). అభిమానులతో టచ్‌లో ఉండటానికి సోషల్ మీడియాలో ఎప్పుడు చురుకుగా ఉంటారు. తరచుగా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 79మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆమె అకౌంట్‌ బుధవారం కనిపించకుండా పోయింది. దీంతో నెటిజన్స్ అందరు ఆరా తీయడం ప్రారంభించారు. ‘‘ప్రియాంక ఇన్‌స్టా అకౌంట్‌కు ఏమైంది. నాకు కనిపించడం లేదు’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ నెట్టింట పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌కు ప్రియాంక టీమ్ రిప్లై ఇచ్చింది. ‘‘అకౌంట్‌ను పునరుద్ధరించడానికి ఇన్‌స్టాగ్రామ్‌తో కలసి పనిచేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను సరిచేస్తాం’’ అని ప్రియాంక టీమ్ తెలిపింది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా అకౌంట్‌ను పునురుద్ధరించారు. అందులో ఆమె పోస్ట్‌లు కూడా పెడుతున్నారు.          


ప్రియాంక చోప్రా చివరగా ‘మ్యాట్రిక్స్-4’ (Matrix 4) లో కనిపించారు. అనంతరం రుస్సో బ్రదర్స్ తెరకెక్కించే ‘సిటడెల్’ (Citadel) వెబ్‌సిరీస్‌లో నటించనున్నారు. కొన్నాళ్ల క్రితమే ప్రియాంక సరోగసీ ద్వారా తల్లయ్యారు. ప్రియంక, నిక్ దంపతులు ఈ ఏడాది ప్రారంభంలో ఓ పాపను తమ జీవితంలోకి ఆహ్వానించారు. తమ ముద్దుల కూతురుకు ‘మాల్టీ మేరీ’ అని వారు పేరు పెట్టారు. ప్రియాంక ‘యనిసెఫ్’ (UNICEF) కు గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. న్యూయార్క్‌లో  ‘సోనా’ అనే భారతీయ రెస్టారెంట్‌ను తాజాగా ప్రారంభించారు. గతంలోనే ఓ హెయిర్ కేర్ బ్రాండ్‌ను లాంచ్ చేశారు.  




Updated Date - 2022-06-23T23:39:48+05:30 IST