Priyanka Chopra : నా క్యారెక్టర్ చిన్నది కాదు... మీ బుద్దులే చిన్నవి...

ABN , First Publish Date - 2021-12-26T02:34:24+05:30 IST

బాలీవుడ్ నుంచీ హాలీవుడ్ దాకా ఎదిగిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక ‘మ్యాట్రిక్స్’ ఫ్రాంఛైజ్‌లో భాగమైంది. ‘ద మ్యాట్రిక్స్ రెసరక్షన్స్’ తాజా సీక్వెల్‌లో ఆమె పెద్ద తెరపై అలరించింది. అయితే, మ్యాట్రిక్స్ లాంటి మోస్ట్ సక్సెస్‌ఫుల్ సిరీస్‌లో మన దేసీగాళ్ ఉండటమే... నిజంగా గర్వకారణం. కానీ, కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. ప్రియాంక పోషించిన పాత్ర సినిమాలో చాలా చిన్నదని కామెంట్స్ చేస్తున్నారు...

Priyanka Chopra : నా క్యారెక్టర్ చిన్నది కాదు... మీ బుద్దులే చిన్నవి...

బాలీవుడ్ నుంచీ హాలీవుడ్ దాకా ఎదిగిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక ‘మ్యాట్రిక్స్’ ఫ్రాంఛైజ్‌లో భాగమైంది. ‘ద మ్యాట్రిక్స్ రెసరక్షన్స్’ తాజా సీక్వెల్‌లో ఆమె పెద్ద తెరపై అలరించింది. అయితే, మ్యాట్రిక్స్ లాంటి మోస్ట్ సక్సెస్‌ఫుల్ సిరీస్‌లో మన దేసీగాళ్ ఉండటమే... నిజంగా గర్వకారణం. కానీ, కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. ప్రియాంక పోషించిన పాత్ర సినిమాలో చాలా చిన్నదని కామెంట్స్ చేస్తున్నారు... 


‘‘అది చాలా చిన్న రోల్... నువ్వు ఎందుకు చేశావ్?’’ అని చాలా మంది పీసీని అడిగారట. వారిని ఉద్దేశించి ఆమె చెబుతోన్న యాన్సర్ ఏంటంటే... ‘‘అలా ఆలోచించటం చాలా తక్కువ స్థాయి మెంటాలిటీ’’ అని! అంతే కాదు, బాలీవుడ్‌లోనూ తాను ఎప్పుడూ ‘క్యారెక్టర్స్‘ చూసి ‘రోల్స్‘ ఎంచుకుందిగానీ... ‘లీడ్’ అవునో కాదో ఆలోచించలేదని ప్రియాంక చెప్పింది. మొత్తంగా ‘ద మ్యాట్రిక్స్’ లెటెస్ట్ సీక్వెల్‌లో తన క్యారెక్టర్ చిన్నది కాదనీ... మీ బుద్దులే చిన్నవని అంటోంది మిసెస్ జోనాస్! 


ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా కూడా ‘ద మ్యాట్రిక్స్’ మూవీలో కూతురు పాత్ర గురించి సొషల్ మీడియాలో స్పందించారు. ప్రియాంక కేవలం 8-10 నిమిషాలు మాత్రమే తెరపై కనిపించిందని మాట్లాడేవారికి ఆమె గట్టిగా బదులిచ్చారు. తన కూతురు పాత్ర సినిమాలో చిన్నది కావచ్చుగానీ... కీలకమైంది అంటూ ఎత్తి చూపారు. చూడాలి మరి, భవిష్యత్తులో తన విమర్శకులకి ప్రియాంక చోప్రా ఫుల్ లెంగ్త్ హాలీవుడ్ రోల్‌తో సమాధానం ఎప్పుడు ఇస్తుందో...    

Updated Date - 2021-12-26T02:34:24+05:30 IST