Priyanka Chopra: కష్టం వారిది.. క్రెడిట్ మాత్రం నటులది..

ABN , First Publish Date - 2022-11-18T19:22:39+05:30 IST

హాలీవుడ్‌ (Hollywood)లోనూ మంచి నటిగా గుర్తింపు పొందిన బాలీవుడ్ (Bollywood) నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra).,

Priyanka Chopra: కష్టం వారిది.. క్రెడిట్ మాత్రం నటులది..

హాలీవుడ్‌ (Hollywood)లోనూ మంచి నటిగా గుర్తింపు పొందిన బాలీవుడ్ (Bollywood) నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra). బీ టౌన్‌లో టాప్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే హాలీవుడ్‌కి వెళ్లిపోయి అక్కడ కూడా మంచి నటిగా పేరు సంపాదించుకుని.. వరుస ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ ఇటీవలే హెయిర్‌కి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించింది. కంపెనీ ప్రొడక్ట్స్‌లో ఇండియా (India)లో ప్రమోట్ చేయడానికి.. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ బ్యూటీ ఇక్కడికి వచ్చింది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో నటులపై సంచలన వ్యాఖ్యలు చేసింది.


ప్రియాంక మాట్లాడుతూ.. ‘ఇది స్టేట్స్‌లోని వ్యాపారంలో ఉత్తమమైన వారితో పని చేయడంతో సంబంధం లేదు. నేను బాలీవుడ్‌లో పని చేస్తున్నప్పుడు కూడా, ఉత్తమ ఫిల్మ్ మేకర్స్‌తో పని చేయడంతో మంచి నటిగా ఉండడం నేర్పింది. అక్కడ నటులకే చాలా క్రెడిట్ ఇస్తాం. నిజానికి నటీనటులు ఏమీ చేయరు. నేను ఎప్పటి నుంచో ఈ విషయం చెబుతున్నాను’ అని చెప్పుకొచ్చింది.


ప్రియాంక ఇంకా మాట్లాడుతూ.. ‘మేము ఎవరో రాసిన డైలాగ్స్ చెబుతాం. మరొకరు రాసిన స్క్రిప్ట్‌పై పని చేస్తాం. ఎవరో పాడిన పాటలకి సింక్ చేసి పాడినట్లు చేస్తాం. వేరొకరు కొరియోగ్రఫీ చేసిన స్టెప్పులకి మేము డ్యాన్స్ చేస్తాం. వేరొకరు ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానం చెప్పి సినిమాని మార్కెటింగ్ చేస్తాం. ఎవరో డిజైన్ చేసిన దుస్తులు ధరిస్తాం. జుట్టు, మేకప్ ఎవరో చేస్తారు. ఇక్కడ మేం చేయడానికి ఏం ఉంది?. సినిమా పరంగా మాకు చాలా చిన్న పాత్రే ఉంటుంది. మేం కేవలం సినిమా గురించి అందరికీ తెలిసేలా చేస్తాం’ అని తెలిపింది.







Updated Date - 2022-11-18T19:22:39+05:30 IST