సినిమా ఇండస్ట్రీలో ఆటుపోట్లు ఎదుర్కొన్నానంటున్న Priyanka Chopra

ABN , First Publish Date - 2021-12-25T23:57:02+05:30 IST

ప్రియాంక చోప్రా 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి రంగ

సినిమా ఇండస్ట్రీలో ఆటుపోట్లు ఎదుర్కొన్నానంటున్న Priyanka Chopra

ప్రియాంక చోప్రా 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేసింది. గత 18ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కెరీర్‌ను కొనసాగిస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్‌లోను బలమైన పాత్రలను పోషిస్తోంది.


తను తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఈ స్థాయిలో ఉన్నానని ఆమె చెప్పింది. ఈ స్థానం చేరుకున్నందుకు గర్విస్తున్నానని పేర్కొంది. ‘‘ ద హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై ’’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో కెరీర్‌ను ఆరంభించింది. అనంతరం ఫ్యాషన్, క్రిష్, బర్ఫీ, అగ్నిపథ్, దిల్ ధడ్కనే దో, బాజీరావ్ మస్తానీ, మేరికొం వంటి తదితర చిత్రాల్లో నటించింది. 


సినిమా ఇండస్ట్రీలో దశాబ్దానికి పైగా కాలాన్ని పూర్తి చేసుకోవడంతో ఆమె తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ‘‘ నా కెరీర్‌లో అనేక అటు, పోట్లు ఎదుర్కొన్నాను. ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు.  నేను తీసుకున్న నిర్ణయాల ఫలితంగానే ఈ స్థాయిలో ఉన్నాను. ఈ స్థాయిలో ఉన్నందుకు గర్విస్తున్నాను ’’ అని ప్రియాంక చోప్రా చెప్పింది. ఈ మధ్యనే  ప్రియాంక ‘ సిటాడెల్ ’ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌ను పూర్తి చేసింది. ఈ వెబ్ సిరీస్‌లో రిచర్డ్ మ్యాడెన్, రొలాండ్ మొల్లర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2021-12-25T23:57:02+05:30 IST