ఎంగేజ్‌మెంట్ రింగ్ అంటే ఎంతో ఇష్టమన్న Priyanka Chopra.. ధర రూ. 2 కోట్లపై మాటే..!

ABN , First Publish Date - 2021-11-10T18:31:22+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకునే జంటల్లో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ జంట ఒకటి. వీరు మూడేళ్ల క్రితం జోధ్‌పూర్‌లో హిందూ, క్రిస్టియన్...

ఎంగేజ్‌మెంట్ రింగ్ అంటే ఎంతో ఇష్టమన్న Priyanka Chopra.. ధర రూ. 2 కోట్లపై మాటే..!

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకునే జంటల్లో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ జంట ఒకటి. వీరు మూడేళ్ల క్రితం జోధ్‌పూర్‌లో హిందూ, క్రిస్టియన్ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు కూడా సక్సెస్ ఫుల్‌గా ప్రోఫెషనల్‌ కెరీర్ కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను ఎదో విధంగా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ప్రియాంక తనకు అత్యంత ఇష్టమైన ఆభరణం తన ఎంగేజ్‌మెంట్ రింగ్ అని తెలిపింది.


ఓ ఇంటర్వూలో మీకు అత్యంత ఇష్టమైన నగ ఏదని? యాంకర్ అడిగింది. ప్రియాంక మాట్లాడుతూ..‘నాకు అత్యంత ఇష్టమైన జ్యుయలరీ ఎంగేజ్‌మెంట్ రింగ్. ఇది చెప్పకపోతే నా భర్త నన్ను చంపేస్తాడు. నేను ధరించే ఆభరణాల గురించి చాలా సెంటిమెంట్‌గా ఉంటాను. ఈ రింగ్ నా జ్ఞాపకాలతో ముడిపడి ఉంటుంది’ అని నవ్వుతూ చెప్పింది. అయితే ఈ జంట వివాహ సమయంలో వారి నిశ్చితార్థపు ఉంగరం వార్తలో నిలిచింది. ఎందుకంటే దాని ధర రూ.2 కోట్లకు పైగా ఉంటుందట. అందుకే ఆ సమయంలో సినీ జనాలు ఆ రింగ్ గురించి ఎంతో అబ్బురంగా మాట్లాడుకున్నారు.

Updated Date - 2021-11-10T18:31:22+05:30 IST