‘నా భర్త Nick Jonas సోదరుల పేర్లు కూడా నాకు తెలీదు.. మా ఇద్దరికీ వయసులో పదేళ్ల తేడా..’

ABN , First Publish Date - 2021-11-24T21:28:12+05:30 IST

గత కొన్ని రోజులుగా ప్రియాంక చోప్రా వార్తల్లో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన భర్త సర్ నేమ్ జోనాస్‌ను తొలగించి అందరి

‘నా భర్త Nick Jonas సోదరుల పేర్లు కూడా నాకు తెలీదు.. మా ఇద్దరికీ వయసులో పదేళ్ల తేడా..’

గత కొన్ని రోజులుగా ప్రియాంక చోప్రా వార్తల్లో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన భర్త సర్ నేమ్ జోనాస్‌ను తొలగించి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె విడాకులు తీసుకోబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ వదంతులకు ఆమె తల్లి మీరా చోప్రా చెక్ పెడుతూ అటువంటిదేమి లేదని తేల్చి చెప్పింది. 


నిక్ జోనాస్, అతడి సోదరులు కెవిన్, జో లను ఆమె రోస్టింగ్ చేస్తూ ఒక షో చేసింది. ‘‘నేను భారత్ నుంచి వచ్చాను. ఆ దేశం సాంస్కృతికంగా ఎంతో ఉన్నతమైనది.  నాకు, నిక్‌కు మధ్య 10 ఏళ్ల గ్యాప్ ఉంది. అతడి సోదరుల పేర్లు ఏమిటో కూడా నాకు తెలియదు. నాకు తెలియని విషయాలను నేనే అతడి నుంచే నేర్చుకుంటాను.  టిక్‌టాక్‌ను  ఏవిధంగా ఉపయోగించాలో నికే నాకు నేర్పించాడు.  నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు వీళ్ల ముగ్గురి కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు ’’ అని ప్రియాంక చోప్రా పేర్కొంది. ఈ షోలో నిక్ జోనాస్ సోదరులతో పాటు సోఫీ టర్నర్, డానియెల్ జోనాస్ తదితరులు పాల్గొన్నారు. రోస్టింగ్ వీడియోకు సంబంధించిన చిన్న భాగాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో  పోస్ట్ చేసింది. ఈ రోస్టింగ్ వీడియో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.



Updated Date - 2021-11-24T21:28:12+05:30 IST