అభిషేక్ బచ్చన్ ఫోన్ నుంచి మరో హీరోయిన్‌కి ప్రియాంక లవ్ మేస్సేజ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-28T17:58:08+05:30 IST

బాలీవుడ్‌లోని పాపులర్ హీరోయిన్స్‌లో ప్రియాంక చోప్రా ఒకరు. బీ టౌన్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ అనంతరం హాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా..

అభిషేక్ బచ్చన్ ఫోన్ నుంచి మరో హీరోయిన్‌కి ప్రియాంక లవ్ మేస్సేజ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

బాలీవుడ్‌లోని పాపులర్ హీరోయిన్స్‌లో ప్రియాంక చోప్రా ఒకరు. బీ టౌన్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ అనంతరం హాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా తన ముద్ర వేసుకుంది. అయితే ఈ భామ పాత ఇంటర్వ్యూ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ యాంకర్ సిమీ గారేవాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో బెస్ట్ ఇంటర్వ్యూ అంటూ ఈ వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో సిమీతో జరిగిన ఇంటర్వ్యూ కొన్ని సరదా విషయాల గురించి తెలిపింది.


ప్రియాంక చోప్రా, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ జంటగా 2006లో ‘బ్లఫ్ మాస్టర్’ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ షూటింగ్‌లో అభిషేక్ ఎక్కువగా ప్రాంక్ చేసేవాడట. అలా ఓ సారి ప్రియాంక ఫోన్‌ని దాచేసి ఏం తెలియనట్లు ఉన్నాడట. అందుకే దానికి రివేంజ్‌గా అభిషేక్ ఫోన్ తీసుకుని దాని నుంచి అంతకుముందు ‘బంటీ ఔర్ బబ్లీ’ మూవీలో ఆయనతో కలిసి నటించిన రాణీ ముఖర్జీకి ప్రియాంక మేసేజ్ చేసిందట. ‘ఎక్కడ ఉన్నావ్.. నేను నిన్ను మిస్ అవుతున్నాను’ అంటూ ఆ మేసేజ్ చేసిన ప్రియాంక ఆ ఫోన్‌ని సిచ్ఛాఫ్ చేసేసి దాచేసిందట.


ఆ విషయాన్నేఇంటర్వ్యూలో సిమీకి చెప్పిన ప్రియాంక నవ్వేసింది. అయితే అందులో ఏ నటికి మేస్సేజ్ చేసింది ప్రియాంక చెప్పనప్పటికీ యాంకరే రాణీనా అంటూ గెస్ చేసింది. దీంతో అవునంటూ ప్రియాంక తలూపింది. అనంతరం అభిషేక్ మేస్సేజ్ చూసిన రాణీ ముఖర్జీ .. ‘హాయ్ ఏబీ.. నీకు ఏమైంది?’ అంటూ రిప్లై ఇచ్చిందట. అయితే తర్వాత ఏం జరిగిందో ఆ వీడియోలో వెల్లడించలేదు.



Updated Date - 2022-02-28T17:58:08+05:30 IST