Priyanka Chopra మనసు దోచిన ‘శర్మ సిస్టర్స్’!

ABN , First Publish Date - 2022-04-09T01:34:10+05:30 IST

ప్రియాంక చోప్రా మనసు దోచిన ‘బ్రిడ్జర్‌టన్’ షోలో ‘కభీ ఖుషీ కభీ గమ్’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించటం మొదలు పెళ్లికి ముందు ‘హల్దీ’ సెరిమనీ దాకా బోలెడు భారతీయ అంశాలు మిళితమై ఉన్నాయి. అవే ఇప్పుడు నెటిజన్స్‌ను నెట్‌ఫ్లిక్స్ షో వైపుకు తెగ లాగేస్తున్నాయి...

Priyanka Chopra మనసు దోచిన ‘శర్మ సిస్టర్స్’!

సినిమాల శకం ఇంకా ముగిసిపోలేదు. కానీ, ఓటీటీల శకం మాత్రం మొదలైపోయింది. అంతే కాదు, ఆన్‌లైన్ వినోదం పూర్తిస్థాయిలో జోరందుకుంది కూడా. కాకపోతే, వెబ్ సిరీస్‌లు హాలీవుడ్ చిత్రాల రేంజ్‌లో జనం దృష్టిని ఆకర్షిస్తుండటంతో కొత్త కొత్త కథలు, కథనాలు కూడా తెర మీదకు దూసుకొస్తున్నాయి. అలా నెటిజన్స్‌ను వరల్డ్ వైడ్‌గా ఎంటర్టైన్ చేస్తోన్న లెటెస్ట్ నెట్‌ఫ్లిక్స్ షోనే... ‘బ్రిడ్జర్‌టన్’!


‘బ్రిడ్జర్‌టన్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇది మొదటి సీజన్ కాదు. గతంలో ‘బ్రిడ్జర్‌టన్’ ఫస్ట్ సీజన్ విజయవంతంగా ప్రేక్షకుల్ని అలరించింది. దాంతో మంచి ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య విడుదలైన బ్రిడ్జర్‌టన్ 2’ మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. అమెరికన్ రైటర్ జులియా క్విన్ నవలల ఆధారంగా ‘బ్రిడ్జర్‌టన్’ వెబ్ సిరీస్‌లు రూపొందిస్తుంటారు. బ్రిటన్‌లో రాజుల కాలం నాటి రాయల్ రొమాన్సులే ఇతివ‌ృత్తాలు. అయితే, ‘బ్రిడ్జర్‌టన్’ సీజన్ టూకి మన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా ఫ్యానైపోయింది!


‘బ్రిడ్జర్‌టన్’ షోలో భారతీయ సంస్క‌ృతిని చక్కగా చూపిస్తున్నారంటూ ప్రియాంక పొగడ్తలు కురిపించింది. ‘‘మెయిన్‌స్ట్రీమ్ టీవీలో దేసీ పాత్రల్ని ప్రధానంగా చూపటం, అద్భుతంగా ఉంది. నేను నా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు అది చాలా అరుదు. ‘బ్రిడ్జర్‌టన్’ షో, ‘శర్మ సిస్టర్స్’ క్యారెక్టరైజేషన్... నాకు ఎంతగానో నచ్చాయి!’’ అంటోంది మిసెస్ జోనాస్. ఇంతకీ, ‘బ్రిడ్జర్‌టన్’ వెబ్ సిరీస్‌లో ‘శర్మ సిస్టర్స్’ ఎవరంటే ఇండియా నుంచీ అప్పట్లో లండన్‌కు వెళ్లిన యంగ్ డస్కీ బ్యూటీస్. వారితో ప్రేమలో పడతాడు ఆనాటి బ్రిటన్ రాకుమారుడు. తరువాత జరిగిన ఆసక్తికర రొమాన్సే ‘బ్రిడ్జర్‌టన్ 2’లోని కథ! శర్మ సిస్టర్స్‌గా సిమోన్ యాష్లే, చరిత్రా చంద్రన్ నటించారు.


ప్రియాంక చోప్రా మనసు దోచిన ‘బ్రిడ్జర్‌టన్’ షోలో ‘కభీ ఖుషీ కభీ గమ్’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించటం మొదలు పెళ్లికి ముందు ‘హల్దీ’ సెరిమనీ దాకా బోలెడు భారతీయ అంశాలు మిళితమై ఉన్నాయి. అవే ఇప్పుడు నెటిజన్స్‌ను నెట్‌ఫ్లిక్స్ షో వైపుకు తెగ లాగేస్తున్నాయి...  

Updated Date - 2022-04-09T01:34:10+05:30 IST