డబ్బులు తీసుకుని హత్యలు చేసే ‘లేడీ కిల్లర్’గా Priyanka Chopra

ABN , First Publish Date - 2022-02-04T03:41:16+05:30 IST

గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన దేసీగాళ్ ప్రియాంక చోప్రా మరో బంపర్ ఆపర్ కొట్టేసింది. హాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ చేసుకుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘ఫాల్కన్’ అనే సూపర్ హీరోగా ఫేమస్ అయిన ఆంథోనీ మ్యాకీతో జోడీ కట్టనుంది. వారిద్దరూ కలసి నటించబోయే సినిమా ‘ఎండింగ్ థింగ్స్’.

డబ్బులు తీసుకుని హత్యలు చేసే ‘లేడీ కిల్లర్’గా Priyanka Chopra

గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన దేసీగాళ్ ప్రియాంక చోప్రా మరో బంపర్ ఆపర్ కొట్టేసింది. హాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ చేసుకుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ‘ఫాల్కన్’ అనే సూపర్ హీరోగా ఫేమస్ అయిన ఆంథోనీ మ్యాకీతో జోడీ కట్టనుంది. వారిద్దరూ కలసి నటించబోయే సినిమా ‘ఎండింగ్ థింగ్స్’. 


ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో రూపొందే ‘ఎండింగ్ థింగ్స్’ యాక్షన్ కామెడీగా తెరకెక్కనున్నట్టు సమాచారం. డబ్బులు తీసుకుని హత్యలు చేసే ఓ కిరాయి హంతకురాలుగా పీసీ కనిపిస్తుందట! అయితే, ‘హిట్‌ ఉమాన్’గా ప్రియాంక ‘ఇక ఈ కెరీర్ చాలు’ అనుకున్నాక ఏం జరిగిందనేదే సినిమా అంటున్నారు. తన హత్యల జీవితాన్ని ముగించి, తన పార్ట్‌నర్‌కి అదే విషయం చెప్పి... అతడితో బంధాన్ని కూడా తెంచేసుకుందామని ‘ఎండింగ్ థింగ్స్’లో హీరోయిన్ భావిస్తుందట. దాని పర్యవసానాలు ఏంటనేదే ప్రేక్షకులు తెరపై చూడనున్నారు. ‘లేడీ కిల్లర్’గా ప్రియాంక ఏ రేంజ్లో పర్ఫామెన్స్ ప్రదర్శిస్తుందో మరి... 

Updated Date - 2022-02-04T03:41:16+05:30 IST